వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి ప్రమాదకరమైన ఈ 9 హ్యాండ్ శానిటైజర్లు వాడొద్దు: ఎఫ్‌డీఏ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: కరోనా మహమ్మారి వణికిస్తున్న నేపథ్యంలో ఆ వైరస్ నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు ప్రజలంతా ఎక్కువగా శానిటైజర్లను వాడుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ అవకాశాన్ని అదనుగా చూసుకుని చాలా నకిలీ శానిటైజర్స్ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అంతేగాక, కొన్ని ప్రమాదకర శానిటైజర్లు కూడా ఉన్నాయి. వీటిని వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశమూ లేకపోలేదు.

మిథనాల్ ప్రమాదకరం..

మిథనాల్ ప్రమాదకరం..

ఈ నేపథ్యంలో విషపూరిత రసాయనాలున్న తొమ్మిది శానిటైజర్లను గుర్తించి, వాటిని ఉపయోగించొద్దని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరించింది. ఇప్పటికే మార్కెట్లకు తరలించిన ఉత్పత్తులను వెనక్కి తీసుకోవాలని ఎస్క్ బయోకామ్ సంస్థను ఆదేశించింది. ఈసంస్థ తయారు చేసిన శానిటైజర్లలో ప్రమాదకర మిథనాల్ ఉండటమే ఇందుకు కారణం.

శానిటైజర్లతో తీవ్రమైన వ్యాధులు.. మరణించే ప్రమాదం కూడా

శానిటైజర్లతో తీవ్రమైన వ్యాధులు.. మరణించే ప్రమాదం కూడా

కాగా, మిథనాల్ ఉన్న శానిటైజర్లను ఉపయోగించడం ఆరోగ్యానికి ప్రమాదకరం. దానిని చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మం శోషించుకుంటుందని, దీంతో వికారం, జలుబు, వాంతులు, తలనొప్పి, చూపుకోల్పోవడం, కోమా, వణుకు వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. కొన్నిసార్లు నరాల వ్యవస్థ దెబ్బతిని మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉందని వెల్లడించింది.

ఈ 9 శానిటైజర్లు అతి ప్రమాదకరం.. వాడొద్దు..

ఈ 9 శానిటైజర్లు అతి ప్రమాదకరం.. వాడొద్దు..

ఈ క్రమంలో ఇప్పటికే మిథనాల్ కలిపిన శానిటైజర్లు ఉపయోగించిన వారు వైద్యులను సంప్రదించాలని ఎఫ్‌డీఏ తెలిపింది. మార్కెట్లలోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజర్
ఎస్క్ బయోకెమ్ హ్యాండ్ శానిటైజర్క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 75శాతం ఆల్కహాల్ది గుడ్ జెల్ యాంటిబ్యాక్టిరియా జెల్ హ్యాండ్ శానిటైజర్
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్ 80 శాతం ఆల్కహాల్
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్ డ్ హ్యాండ్ శానిటైజర్ 75 శాతం ఆల్కహాల్
క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్ డ్ హ్యాండ్ హ్యాండ్ శానిటైజర్ 80 శాతం ఆల్కహాల్
శానిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజర్లను వాడొద్దని వినియోగదారులకు ఎఫ్‌డీఏ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ శానిటైజర్లు నిత్యావసరంగా మారిన విషయం తెలిసిందే. అయితే, శానిటైజర్లు తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary
FDA warns: These 9 hand sanitizers may contain a potentially fatal ingredient.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X