వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో ఉగ్రవాద శిక్షణ శిబిరాల ఎత్తివేత : బాలాకోట్ దాడుల తర్వాత మారిన పరిస్థితి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ ఆటలను అంతర్జాతీయ సమాజంలో ఎండగడుతున్న భారత్ .. ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తున్నారనే విషయాన్ని బాలాకోట్ దాడులతో రుజువు చేసింది. అగ్రదేశాల నుంచి పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావడంలో భారత్ సక్సెస్ సాధించింది. దౌత్యపరంగా కూడా ప్రెషర్ తీసుకొచ్చి .. పాకిస్థాన్‌ను ఊపిరాడనీయడం లేదు. దీంతో దాయాది అదిరి .. బెదిరిపోయింది.

బాలాకోట్ దాడులతో ..

ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్... ఇండియా..కు భయపడి ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఎత్తివేస్తున్న పాకిస్థాన్...

బాలాకోట్‌పై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది చేసిన దాడులను గుర్తుకు చేసుకుంటున్నారు. తమ దేశంలో ఉన్న మరిన్ని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తారా అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే 11 ఉగ్రవాద స్థావరాలను కూల్చివేసినట్టు తెలుస్తోంది. ఇందులో ఐదు ముజఫరాబాద్, కోట్లి క్లస్టర్, బార్నాలాలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని లష్కరే తోయిబా నిర్వహిస్తున్నాయని పాక్ గుర్తించింది. కోట్లి, నిఖిల్, సుందర్‌బని, రాజౌరిలో కూడా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు.

Fearing more Balakots, Pakistan shuts down terror camps in PoK

తాత్కాలికమా ?
పాలా, బాగ్‌లో జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను నిర్వహిస్తోంది. కోట్లిలో హిజ్బుల్ ముజాహీద్దిన్ సంస్థ ఉగ్రవాద శిక్షణ శిబిరం నడుపుతుంది. వీటిని కూల్చివేసినట్టు పాకిస్థాన్ అధికార వర్గాలు పేర్కొన్నారు. ముజఫరాబాద్, మిర్పూర్‌లోని ఉగ్ర స్థావరాలను కూడా నేలమట్టం చేసినట్టు వివరించారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలను తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది. మళ్లీ ఉద్రిక్తత తగ్గాక .. దాయాది పాకిస్థాన్ ఆ సంస్థలకు ఆశ్రయం ఇస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై దాడి తర్వాత .. పాకిస్థాన్ నుంచి చొరబాట్లు నిలిచిపోయాయి.

English summary
fearing retaliation from India and under pressure from the international community, Pakistan has shut down terror camps on its soil, in the past few months. The move comes after India intensified pressure on Pakistan through dossiers shared on global platforms, giving evidence of terror camps backed by the Pakistan Army in Pakistan-occupied Kashmir (PoK).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X