వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒబామానే చివరి ప్రెసిడెంట్: బాబా వంగా జోస్యం, ట్రంప్ వర్గం ఆందోళన, ఏం జరిగేనో?

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అంతర్జాతీయ ట్రేడ్ సెంటర్ పైన విమానాలతో దాడి చేస్తాయని, ఇస్లామిస్ స్టేట్ తీవ్రవాదుల దాడులు పెరుగుతాయని, సునామీ వచ్చి వేలాది మంది చనిపోతారని గతంలో కచ్చితమైన జోస్యం చెప్పిన బల్గేరియా ప్రవక్త బాబా వంగా అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా పైన చేసిన వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్ వర్గీయుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

అమెరికా 44వ అధ్యక్షుడిగా ఆఫ్రికన్ - అమెరికన్ ఎన్నికవుతారని, ఆయనే అమెరికాకు ఆఖరి అధ్యక్షుడు అవుతారని, బాబా వంగా జోస్యం చెప్పారు. ఈయన మరో నోస్ట్రడోమస్‌గా పేరు గాంచారు.

ఆయన చెప్పినట్లుగా ఒబామా 44వ అధ్యక్షుడయ్యారు. ఒబామా ఆఖరి అధ్యక్షుడు అవుతాడనే జోస్యం వెనుక ఏం దాగి ఉందనే చర్చ సాగుతోంది.

donald trump

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన విషయం తెలిసిందే. ఆయన 45వ అధ్యక్షుడు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అప్పటి దాకా ఒబామానే అధ్యక్షులు.

అయితే, ఈ రెండు నెలల్లో దేశంలో ఊహించని పరిణామాలు ఏం జరుగుతాయి? ముస్లీంలకు వ్యతిరేకంగా ట్రంప్ మాట్లాడినందున తీవ్రవాదులు ఆయన పైన దాడులు చేసే అవకాశముందా? లేక ఆయన అధ్యక్ష వ్యవస్థను మార్చి వేసి మరో వ్యవస్థను తీసుకు వస్తారా? లేదా రష్యా భావిస్తున్నట్లు మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందా? అందులో అమెరికా అధ్యక్ష వ్యవస్థ కూలిపోతుందా? ఇలా ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

ఏం అనూహ్య పరిణామాలు జరిగితే బాబా వంగా జోస్యం ఫలిస్తుందని, లేదా అన్నీ నిజమైనప్పటికీ ఇది నిజం కావాలనే గ్యారెంటీ లేదనే వారు కూడా ఉన్నారు. గుడ్డి బాబాగా పేరొందారు. బాబా వంగా 1996లో తన 85వ ఏట మరణించారు. ఆమె భవిష్యవాణిలో 85 శాతం నిజమయ్యాయి,

English summary
Fears for Donald Trump - Baba Vanga says Barack Obama will be LAST EVER President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X