వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో మహిళ వింత చేష్టలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

లాస్ ఏంజిల్స్: విమానంలో ఓ మహిళ చేసిన వింత చేష్టలతో సాటి ప్రయాణికులు బిత్తరపోయారు. సుధీర్ఘ విమాన ప్రయాణంలో ఉన్న సాటి ప్రయాణికులు గురకపెట్టి నిద్రపోతున్నా అదేమీ పట్టించుకోకుండా తన సీటులో ఇష్టం వచ్చినట్లు శీర్షాసనం వేసుందుకు సిద్దం అయ్యింది.

తల కిందకు కాళ్లు పైకి పెట్టి శీర్షాసం వేస్తుంటే సాటి ప్రయాణికులు షాక్ కు గురైనారు. లాస్ ఏంజిల్స్ నుంచి కాబో సాన్ లుకాస్ కు ఓ విమానం బయలుదేరింది. అందులో ఓ మహిళ పక్కన ఓ జంట కుర్చుంది.

ఆ జంటతో పాటు చాల మంది ప్రయాణికులు గురకపెట్టి నిద్రపోతున్నారు. ఒక్క సారిగా ఆ మహిళ తల కిందకు కాళ్లు పైకి పెట్టి శీర్షాసనం వెయ్యడానికి ప్రయత్నించడంతో విమానంలో గందరగోళం నెలకొంది.

విషయం తెలుసుకున్న ఎయిర్ హోస్టెస్ అక్కడికి చేరుకుని మహిళను ప్రశ్నించారు. తనకు అనారోగ్యంగా ఉందని, అందుకు చిన్నచిన్న యోగసనాలు వేస్తున్నానని చెప్పింది. ప్రయాణికులకుఅభ్యంతరం అయితే నిలిపివేస్తానని ఆమె చెప్పింది.

ఎయిర్ హోస్టెస్ అటు వెళ్లిన తరువాత మళ్లీ ఆమె తన చేష్టలు మొదలు పెట్టింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న రీడ్ మొబ్రెస్ అనే ఆయన ఆమె వేస్తున్న శీర్షాసనం మొబైల్ లో రికార్డు చేసి ట్వీట్టర్ లో పెట్టారు.

English summary
After doing a series of neck stretches, she proceeded to do a headstand on the seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X