వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఆర్మీపై జోకులు: యువతికి జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

మయన్మార్: సైన్యాన్ని కించపరిచేలా ఫేస్ బుక్ లో పోస్టు చేసినందుకు ఓ యువతికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. చా శాండి టున్ (25) అనే యువతి మయన్మార్ సైన్యాన్ని కించపరిచినందుకే జైలు శిక్ష పడిందని స్థానిక పోలీసులు తెలిపారు.

ఈమె మయన్మార్ ఆర్మీ యూనిఫాం రంగులు మార్చేశారని ఆరోపణలు ఉన్నాయి. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత, నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ నాయకురాలు ఆంగ్ సాన్ సూచి ధరించే దుస్తులతో (లుంగీ) పోల్చుతూ ఆర్మీ యూనిఫాంను పోల్చింది.

Female activist jailed for Facebook post satirising army in Myanmar

మీరు అమ్మను ప్రేమిస్తే ఎందుకు మీ తలపై వస్త్రాన్ని (లుంగీ) చుట్టుకోరాదు అంటూ ఫేస్ బుక్ పేజీలో రాసింది. ఈ ఫేస్ బుక్ పోస్టు దూమరం రేగడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గత అక్టోబర్ నెలలో చా శాండి టున్ ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఫేస్ బుక్ పేజీలో చా శాండి టున్ ఆ వ్యాఖ్యలు పోస్టు చెయ్యలేదని, ఆమె అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని ఆమె తరుపు న్యాయవాది కోర్టులో చెప్పారు. అయితే చా శాండి టున్ నేరం చేసినట్లు రుజువు అయ్యిందని ఆరు నెలల జైలు శిక్ష విధిస్తున్నామని కోర్టు తెలిపింది.

English summary
Chaw Sandi Tun, was arrested in October after a post on her Facebook page made fun of the army.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X