వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీవీ చానల్లో యాంకర్ ముఖం, ఆగ్రహజ్వాలలు, వివరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Female anchor appears without headscarf
లండన్: ఓ మహిళా టీవీ యాంకర్ ముఖం టీవీలో కనిపించడంపై సదరు టీవీ చానల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఇటీవల లండన్‌లో ఉన్న అల్ ఎ ఖబరియా సౌదీ చానెల్ స్టూడియో నుంచి ఓ యువతి వార్తలు చదివింది. ఆ సమయంలో ఆమె బురఖా ధరించలేదు. దీంతో ప్రేక్షకులు అవాక్కయ్యారు.

ఓ ముస్లిం చానెల్లో, ముస్లిం యువతి ఆ విధంగా వార్తలు చదవడం సంచలనాన్ని సృష్టించింది. దీనిపై విమర్శలు, ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఈ చానెల్లో కార్యక్రమాలకు అతిథిగా వచ్చే విదేశీ వనితలకు తప్ప, మరెవరరికీ తల మీద ముసుగు లేకుండా కనిపించే హక్కు లేదు.

ఇది తీవ్రమైన మత ద్రోహమంటూ మతగురువులు, పెద్దలు తీవ్ర విమర్శలు గుప్పించారు. దాంతో భయపడిన చానెల్ నిర్వాహకులు ఆమె తమ చానెల్ ఉద్యోగి కాదని, లండన్‌కు చెందిన గెస్ట్ న్యూస్ రీడర్ అని, అందువల్లే పొరపాటు జరిగిందని మత పెద్దలకు వివరణ ఇచ్చింది.

ఈ వివరణ హక్కుల కార్యకర్తలను మండిపడేలా చేసింది. మహిళా స్వేచ్ఛకు తీవ్ర భంగంగా భావించిన హక్కుల కార్యకర్తలు చానెల్ స్టేట్‌మెంట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యారు. ముస్లిం న్యూస్‌ రీడర్లకు ముఖాన్ని చూపించే హక్కు లభించేవరకూ పోరాడతామని హెచ్చరిస్తున్నారు.

English summary
Female anchor appears without headscarf in a TV Channel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X