వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

16 మందిని చంపిన మహిళా సూసైడ్ బాంబర్

By Pratap
|
Google Oneindia TeluguNews

 Female suicide bomber kills 16 at Russia train station
మాస్కో: రష్యాలోని వోల్గోగ్రాడ్ పట్టణంలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి బాంబర్ దాడిలో 16మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మధ్యాహ్నం రైల్వేస్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిన సమయంలో ప్రవేశద్వారం సమీపంలోని మెటల్ డిటెక్టర్ల వద్ద ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడింది.

విస్ఫోటన తీవ్రతకు పై అంతస్తులోని కిటికీ అద్దాలు పగిలిపోయాయి. మహిళా ఆత్మాహుతి బాంబరే దాడికి పాల్పడి ఉంటుందని జాతీయ ఉగ్రవాద నిరోధక కమిటీ ప్రకటనలో అభిప్రాయపడింది. సంఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నామని రష్యా దర్యాప్తు కమిటీ ప్రతినిధి వ్లాదిమిర్ మార్కిన్ తెలిపారు.

సంఘటనలో 16మంది మరణించారని, 40మంది గాయపడ్డారని ప్రాంతీయ ప్రభుత్వ ప్రతినిధి ధ్రువీకరించారు. సోవియట్ యూనియన్ శకంలో స్టాలిన్‌గ్రాడ్‌గా పేర్కొన్న ఈ ప్రాంతంలో గతంలోనూ మహిళా ఆత్మాహుతి బాంబర్ దాడి జరిగిందని వెల్లడించారు.

దాడులతో ఉత్తర కాకసస్‌లోని సాయుధ ఇస్లామిక్ దళాలకు సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్నారు. సోచి రిపబ్లిక్‌లో ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ జరుగుతున్న తరుణంలో జరిగిన ఆత్మాహుతి దాడులు నిర్వాహకులను బెంబేలెత్తిస్తున్నాయి.

English summary
A female suicide bomber killed at least 16 people Sunday in an attack on the main train station of the southern Russian city of Volgograd, heightening security fears just six weeks before the Sochi Olympic Games.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X