వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడ బురఖా ధరిస్తే రూ. 6.50 లక్షల ఫైన్

|
Google Oneindia TeluguNews

బెర్న్: బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు వేసుకుంటే భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని స్విర్జర్లాండ్ లోని టిసినో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఇక మీదట ప్రభుత్వ నియమాలు ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

2013 సెప్టెంబర్ నెలలో బహిరంగ ప్రదేశాలలో బురఖాలు నిషేదించాలని రెఫరెండమ్ నిర్వహించారు. ఆ సందర్బంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు బురఖాలు నిషేధించాలని సానుకూలంగా ఓటు వేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ టిసినో రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది.

బురఖాలు నిషేధించడం ఫెడరల్ చట్టానికి వ్యతిరేకం కాదని అక్కడి కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థించింది. నిషేధాన్ని ఉల్లంఘించి ముఖం కనపడకుండా బురఖాలు ధరించిన వారి నుంచి రూ. 6,500 నుంచి రూ. 6.50 లక్షల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు.

Females muslims will be banned from wearing the burqa in Switzerland.

అయితే ఈ చట్టం ఎప్పటి నుంచి అమలు చేస్తాం అని ప్రభుత్వం కచ్చితంగా చెప్పలేదు. మొదట ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్, దుకాణాలు, రెస్టారెంట్లు తదితర ప్రదేశాలలో బురఖాలు ధరించకుండా చట్టం తీసుకు వస్తామని అధికారులు అంటున్నారు.

మొదట విమానాశ్రయాలలో ప్రయాణికులకు ఈ చట్టం గురించి తెలియజేస్తామని వివరించారు. బురఖాలు వేసుకుని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించకుండా చూస్తామని, దోపిడీలు, దొంగతనాలకు పాల్పడకుండా నిరోధిస్తామని అధికారులు తెలిపారు.

2010లో ఫ్రాన్స్ లో బహిరంగ ప్రదేశాలలో బురఖాలు ధరించరాదని చట్టం తీసుకు వచ్చింది. బహిరంగ ప్రదేశాలలో బురఖాలు వేసుకుంటే ఫ్రాన్స్ రూ. 3,500 నుంచి రూ. 15,000 జరిమానా విధిస్తున్నది. ఇప్పుడు ఫ్రాన్స్ తరువాత బురఖాలు నిషేధించిన రెండవ దేశంగా స్విడ్జర్లాండ్ నిలిచింది.

English summary
Females muslims will be banned from wearing the burqa in shops, restaurants or public buildings in Ticino in Switzerland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X