వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల అపహరణకు గురై మతం మార్చబడిన 17ఏళ్ల యువతి చివరకు తిరిగి తమ తల్లిదండ్రుల వద్దకు చేరింది. బాలికను కిడ్నాప్ చేసిన ముస్లిం యువకుడు ఆమెను బలవంతంగా మతం మార్చి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై పాకిస్థాన్ తోపాటు మనదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో పాకిస్థాన్ చర్యలు తీసుకోక తప్పలేదు.

రేపే జియో ఫైబర్ ప్రారంభం: రిజిస్ట్రేషన్, ధరలు, 4కే టీవీ ఆఫర్, 'ఫస్ట్ డే ఫస్ట్ షో', ఇతర వివరాలు రేపే జియో ఫైబర్ ప్రారంభం: రిజిస్ట్రేషన్, ధరలు, 4కే టీవీ ఆఫర్, 'ఫస్ట్ డే ఫస్ట్ షో', ఇతర వివరాలు

పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కు అమ్మాయిలను అపహరించి మతం మార్చి పెళ్లి చేసుకోవడం సాధారణంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నా.. అక్కడి ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజా ఘటనకు మీడియాలో ఎక్కువ ప్రచారం జరగడం, నలువైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో చర్యలు తీసుకోక తప్పలేదు.

 Feud over Sikh girl conversion in Pakistan ends, in-laws say girl free to return to parents

లాహోర్‌లోని నంకన సాహి ప్రాంతంలో ఉన్న గురుద్వారాలో ప్రబోధకుడిగా పనిచేస్తున్న భగవాన్ సింగ్ కుమార్త జగ్జీత్ కౌర్(17)ను కొద్ది రోజుల క్రితం కొందరు ముస్లింలు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా మతం మార్చి మహ్మద్ ఎహ్సాన్ అనే ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు.

జగ్జీత్ కౌర్ పేరును అయేషాగా మార్చాడు వివాహం జరిపించిన ఓ మౌల్వి. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కాగా, తన సోదరి కిడ్నాప్ అయ్యిందంటూ బాలిక అన్నయ్య మన్మోహన్ సింగ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు.

తమ కూతుర్ని కాపాడి తమకు న్యాయం చేయాలంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు విజ్ఞప్తి చేశారు బాధిత బాలిక కుటుంబసభ్యులు. దీనికి సంబంధించిన వీడియోను శిరోమణి అకాలీదళ్ అధికార ప్రతినిధి మజీందర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిక్కు సంఘాలు ఈ ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపాయి. వెంటనే బాలికను ఆమె తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని డిమాండ్ చేశారు.

పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా ఆ బాలికను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. సిక్కు కమ్యూనిటీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పాకిస్థాన్ చర్యలకు ఉపక్రమించింది.

జగ్జీత్ కౌర్‌ను ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించిన పోలీసులు.. ఈ కేసులో 8మందిని అదుపులోకి తీసుకున్నారు. సిక్కు అమ్మాయి సురక్షితంగా ఆమె ఇంటికి చేరిందని, ఇదో గొప్ప వార్త అని పాకిస్థాన్ లోని పంజాబ్ గవర్నర్ మొహమ్మద్ సర్వర్ పేర్కొన్నారు.

English summary
The teenage Sikh girl, who was allegedly abducted and converted to Islam before being married to a Muslim man in Pakistan's Punjab province has finally found justice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X