వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరమాంకంలో ఉన్నా, ఇదే చివర కావొచ్చు: ఫిడెల్ క్యాస్ట్రో

By Srinivas
|
Google Oneindia TeluguNews

హవానా: క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షులు ఫిడెల్ క్యాస్ట్రో ఒకప్పుడు తాను విజయపథంలో నడిపించిన కమ్యూనిస్టు పార్టీ నుంచి సెలవు తీసుకున్నారు. జీవిత చరమాంకంలోకి ప్రవేశించానని చెప్పారు. తన ఆదర్శాలను కొనసాగించాలని పార్టీకి పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ సమావేశాలకు హాజరై ప్రసంగించారు.

తాను జీవిత చరమాంకానికి చేరుకున్నానన్నారు. తాను లేకపోయినా, తన అభిప్రాయాలు ఉంటాయని, వాటిని కొనసాగించాలని కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులకు పిలుపునిచ్చారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ ఏడో మహాసభల ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి క్యాస్ట్రో ప్రసంగించారు.

అంతిమ వీడ్కోలు తీసుకునే తరహాలో ఆయన ప్రసంగం కొనసాగింది. త్వరలో నేను తొంబై ఏళ్లకు చేరుకుంటున్నానని, అందరిలాగే తనకూ చరమాంకం వచ్చిందని, ఇది అందరికీ తప్పని దశ అన్నారు. కానీ ఉత్సాహం, హుందాతనంతో కృషి చేస్తే మనుష్యుల వస్తుపరమైన, సాంస్కృతిక అవసరాలను తీర్చటం సాధ్యమేనని మనం నిరూపించామన్నారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

క్యూబా కమ్యూనిస్టుల అభిప్రాయాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయన్నారు. ఈ సమావేశ మందిరంలో తాను మాట్లాడటం ఇదే చివరిసారి కావచ్చన్నారు. తన సోదరుడు, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఫిడెల్‌ ప్రశంసించారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

రౌల్‌తోపాటు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు. ప్రసంగంలో భాగంగా చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ ముగిసింది. ప్రథమ కార్యదర్శిగా 84 ఏళ్ల రౌల్ క్యాస్ట్రోను, ద్వితీయ కార్యదర్శిగా క్యూబా ఉపాధ్యక్షుడు, 85 ఏళ్ల జోస్ రామోన్‌ మచాడో వెంచురాను తిరిగి ఎన్నుకున్నారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

కాగా, వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా అన్నిరకాల పదవులకు దూరంగా ఉంటున్న క్యాస్ట్రో చాలాకాలం తర్వాత పార్టీ సమావేశాలకు రావడమే కాకుండా ఎక్కువసేపు గడిపారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

1959లో సాయుధ విప్లవం అనంతరం క్యూబాలో ఫిడెల్ క్యాస్ట్రో పాలన ప్రారంభమైంది. దశాబ్దాలపాటు సోషలిస్టు విధానాలను అనుసరించిన క్యూబా.. రౌల్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక సంస్కరణలను పరిమితస్థాయిలో అమలుపరిచింది. దీంతోపాటు చిరకాల శత్రువు అమెరికాతో స్నేహసంబంధాలను రౌల్‌ ప్రారంభించారు.

ఫిడెల్ క్యాస్ట్రో

ఫిడెల్ క్యాస్ట్రో

మీడియా ప్రభుత్వం నియంత్రణలో ఉండటం, కమ్యూనిస్ట్ పార్టీకి తప్ప మరో పార్టీకి అవకాశం లేకపోవటం, కమ్యూనిస్ట్ పార్టీలో యువతకు ప్రాధాన్యం కల్పించకపోవటం, ప్రభుత్వసంస్థల్లో పెరుగుతున్న అవినీతి, ఆర్థికసమస్యల నేపథ్యంలో క్యూబా నుంచి అమెరికా తదితర దేశాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ లేనంత అధికంగా ఉంటోంది.

English summary
Fidel Castro on Tuesday once again did what no else in Cuba can and addressed his mortality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X