• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విచిత్రం: మూడేళ్లుగా కొబ్టరి చెట్టుపైనే.. దిగితే చంపేస్తారంటాడు! చివరికి...

By Ramesh Babu
|

మనీలా: ఫిలిప్పీన్స్‌లో ఓ వ్యక్తి అనవసర భయాందోళనకు గురయ్యాడు. తనను ఎవరో చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తన ఇంటికి సమీపంలోని కొబ్బరిచెట్టు ఎక్కేశాడు. అలా కొబ్బరిచెట్టు ఎక్కిన అతడు.. ఏకంగా మూడేళ్ల పాటు చెట్టుపైనే గడిపాడు.

చివరికి అతడి ఉదంతం సోషల్ మీడియా ద్వారా లోకమంతటికీ తెలియడంతో అతడ్ని చెట్టుమీదనుంచి కిందికి దింపడానికి అక్కడి ప్రభుత్వం 50 మందితో కూడిన రెస్క్యూ టీంను పంపించి దింపించింది.

Filipino Man Rescued After Spending Three Years Atop 60-Foot-Tall Coconut Tree

వివరాల్లోకి వెళితే... ఫిలిప్పీన్స్‌లోని అగుసాన్‌ డెల్‌ సర్ ప్రావిన్స్‌.. లాపాజ్‌కు చెందిన గిల్బెర్ట్‌ సాంచెజ్‌(47) మూడేళ్ల క్రితం తన ఇంటికి సమీపంలో ఉన్న 60 అడుగుల కొబ్బరిచెట్టు ఎక్కాడు. 2014లో చెట్టుపైకి ఎక్కిన ఆయన.. కొద్దిరోజుల క్రితం వరకు కిందికి దిగలేదు.

మూడేళ్లకు పైగా అదే చెట్టుపై గడిపాడు. వృద్ధురాలైన అతని తల్లి సహా కుటుంబసభ్యులు ఎంతగా చెప్పినా కిందికి దిగలేదు. కిందికి వస్తే తనను ఎవరైనా చంపేస్తారంటూ విచిత్రంగా వాదించడం మొదలెట్టాడు.

ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గిల్బెర్ట్‌ తలపై తుపాకీతో కొట్టారని.. అప్పటి నుంచి అతడు ఈ విధంగా భయాందోళన చెందుతూ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని అతని తల్లి వినిఫ్రెడా తెలిపారు.

ఎన్నిసార్లు ప్రాధేయపడినా గిల్బెర్ట్‌ కిందికి రాకపోవడంతో చేసేదేమీలేక కుటుంబసభ్యులే రోజూ అతనికి చెట్టుపైకి ఆహారం అందించేవారు. ఓ తాడు సాయంతో ఆహారం, నీరు, సిగరెట్లు, దుస్తులను చెట్టుపైకి చేర్చేవారు. దాన్ని గిల్బెర్ట్‌ అందుకునేవాడు. ఈ విధంగా మూడేళ్లు గడిచిపోయాయి.

ఏళ్ల తరబడి చెట్టుపైనే ఉండిపోవడంతో అతనికి పలు రకాలు చర్మ వ్యాధులు సోకాయి. శరీరం నుంచి దుర్వాసన కూడా వచ్చేది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గిల్బెర్ట్‌ కిందికి దిగలేదు. అతని కుమార్తెలు సైతం ప్రాధేయపడినా పరిస్థితిలో మార్పు రాలేదు.

కిందికి దిగితే తనను ఎవరైనా చంపేస్తారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేవాడు. కనీసం స్నానం చేసేందుకైనా కిందికి రావాలని చెప్పినా వినిపించుకోలేదని అతని తల్లి వినిఫ్రెడా కన్నీటి పర్యంతమవుతూ చెప్పింది.

గిల్బెర్ట్‌ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో రోజురోజుకీ వారి కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. కుటుంబ పరిస్థితి దృష్ట్యా అతని కుమార్తెలు ఇద్దరూ పాఠశాలకి వెళ్లడం మానేశారు. ఆ ప్రాంతంలో గిల్బెర్ట్‌ పరిస్థితి గురించి కొంతమందికి తెలిసినా వారెవరూ అంతగా పట్టించుకోలేదు.

చివరికి సోషల్‌మీడియాలో ఈ విషయం వైరల్‌గా మారడంతో ఫిలిప్పీన్స్‌లోని మీడియా సంస్థలు దృష్టి సారించి కథనాలు ప్రసారం చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం గిల్బెర్ట్‌ను చెట్టు నుంచి కిందికి దించే చర్యలను ప్రారంభించింది.

50 మందితో కూడిన రెస్క్యూ టీం అక్టోబర్‌ 11న అతన్ని సురక్షితంగా కొబ్బరిచెట్టు మీదనుంచి కిందికి దించింది. అనంతరం అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతను కండరాల క్షీణత, వెన్నెముక సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో గిల్బెర్ట్‌ కుటుంబానికి సాయం అందించేందుకు అక్కడి ప్రజలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 47-year-old man from La Paz, in the Agusan del Sur province of the Philippines, had last felt solid ground under his feet in 2014, before climbing a 60-foot-tall coconut tree near his house. He had never come down since, and would have probably stayed atop the tree till the end of his days, had authorities not rescued him by force recently. The man, identified as Gilbert Sanchez, had apparently left his home to live atop a nearby coconut tree three years ago, after being hit on the head with a gun, during an altercation. His mother remembers that he was so afraid that someone would come to kill him that he felt that the only way to stay alive was to climb the tallest tree he could find and stay there. And that’s exactly what he had been doing for the last three years, surviving only on the food and water his mother brought him every day, which he would pull up in his tree haven with an improvised rope. He would relieve himself from the top of the tree, and not even the raging storms, the blistering heat or the ruthless insects could get him to come down.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more