వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేనే అతి తక్కువ జాత్యహంకారిని: డొనాల్డ్ ట్రంప్, మంట పెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా: జో బైడెన్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గురువారం రాత్రి అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ జరిగింది. ఈ డిబేట్‌లో అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ పరస్పర ఆరోపణలు, విమర్శలతో చర్చను కొనసాగించారు.

Recommended Video

US Election 2020 : ట్రంప్ vs జో బైడెన్.. అధ్యక్ష ఎన్నికల చివరి డిబేట్ లో నేతల మధ్య మాటల తూటాలు!

us election 2020: అధ్యక్ష డిబేట్లోనూ భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ అక్కసు, 'మురికి’ అంటూ!us election 2020: అధ్యక్ష డిబేట్లోనూ భారత్‌పై డొనాల్డ్ ట్రంప్ అక్కసు, 'మురికి’ అంటూ!

ఈ గదిలో అత్యంత తక్కువ జాత్యహంకారిని నేనే..

ఈ గదిలో అత్యంత తక్కువ జాత్యహంకారిని నేనే..

ఈ గదిలో అతి తక్కువ జాత్యహంకారం కలిగిన వ్యక్తిని తానేనని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘నాకు అందరితో గొప్ప సంబంధాలు ఉన్నాయి. నేను ఈ గదిలో అతి తక్కువ జాత్యహంకారం గల వ్యక్తిని అనుకుంటున్నాను. నేను ప్రేక్షకులను కూడా చూడలేను ఎందుకంటే ఇది చాలా చీకటిగా ఉంది, కానీ ప్రేక్షకులలో ఎవరు ఉన్నారో నేను పట్టించుకోను ... ఈ గదిలో నేను అతి తక్కువ జాత్యహంకార వ్యక్తిని' అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

అబ్రహాం లింకన్ తప్ప..

అబ్రహాం లింకన్ తప్ప..

తనకన్నా నల్లజాతి సమాజం కోసం ఎవ్వరూ ఎక్కువ చేయలేదని పేర్కొన్నారు డొనాల్డ్ ట్రంప్, ‘నల్లజాతి సంఘం నన్ను ఇష్టపడుతుంది, నేను వారిని ఇష్టపడుతున్నాను. అబ్రహం లింకన్ తప్ప మరెవరూ నల్లజాతి సమాజం కోసం ఎక్కువ చేయలేదు' అని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్.. మంటపెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా: జో బైడెన్

ట్రంప్.. మంటపెట్టడంలో నీ తర్వాతే ఎవరైనా: జో బైడెన్

అనంతరం ట్రంప్ వ్యాఖ్యలపై జో బిడెన్ స్పందిస్తూ.. ‘ఇక్కడ ఆధునిక చరిత్రలో మనకు ఉన్న అత్యంత జాత్యహంకార అధ్యక్షులలో ఒకరు అబ్రహం లింకన్(జో బిడెన్ ఉద్దేశంలో డొనాల్డ్ ట్రంప్). అతను ప్రతి జాత్యహంకార మంటపై ఇంధనం పోస్తాడు - ప్రతి ఒక్కటి.' అని ఎదురుదాడి చేశారు. అంతేగాక, గత డిబేట్‌లో తెల్లజాత అధిపత్యాన్ని ట్రంప్ ఖండించలేదని, వారికి అండగా నిలుస్తున్నారని జో బైడెన్ వ్యాఖ్యానించారు.

అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీనే..

అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీనే..


కాగా, ఎన్నికల ముందు జరిగే చివరి డిబేట్ కావడంతో ట్రంప్, బిడెన్ హోరాహోరీగా తమ చర్చను సాగించారు. అమెరికాలో కరోనా మహమ్మారి బారినపడి 2 లక్షలకుపైగా ప్రజలు మృతి చెందారు. 80 లక్షల మందికిపైగా కరోనా పడటం గమనార్హం. కరోనా సరైన రీతిలో ట్రంప్ నియంత్రించలేకపోయారని ఇప్పటికే జో బైడెన్ తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ఓపినియన్ పోల్స్ జో బైడెన్ గెలుస్తాడనే చెబుతున్నాయి. అయితే, అమెరికాలోని పెద్ద రాష్ట్రాలు ఫలితాలను తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు. ట్రంప్, బిడెన్ ల మధ్య జరిగిన తొలి డేబిట్‌ను 73 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం. ట్రంప్‌కు కరోనా సోకడంతో రెండో డిబేట్ రద్దయింది. ఆ తర్వాత ట్రంప్ కరోనా నెగిటివ్ అని నిర్ధారణ కావడంతో మూడో డిబేట్ గురువారం రాత్రి జరిగింది.

English summary
Final debate: Donald Trump says he is least racist person in the room, Joe Biden responds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X