వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరి డిబేట్: హిల్లరీ హ్యాట్రిక్ హిట్, ట్రంప్ ఫట్, ఎవరేమన్నారంటే..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ లాస్ వేగాస్ యూనివర్సిటీలో జరిగిన చివరి డిబేట్‌లో పాల్గొని పోటాపోటీగా తమ వాదనను గట్టిగా వినిపించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే.. తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంస్కరణలు చేపడతామనేదానిపై ఇద్దరు నేతలు స్పష్టతనిచ్చారు. కాగా, తొలి రెండు డిబేట్లలో హిల్లరీ ఆధిక్యం సాధించగా... ట్రంప్‌ వెనకబడ్డారు. మరోవైపు మహిళలపై లైంగిక ఆరోపణలతో ట్రంప్‌ సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో చివరి డిబేట్ ఆసక్తికరంగా మారింది.

హిల్లరీ క్లింటన్‌.. తాను అధికారంలోకి వస్తే చిరు వ్యాపారులకు ఊతమిస్తానన్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా మహిళలకు అవకాశాలు కల్పిస్తా నని హామీ ఇచ్చారు. ట్రంప్‌కు దేశ నిఘా వర్గాల మీద నమ్మకం లేదని విమర్శించారు. దేశ నిఘా అధికారుల కంటే ఆయన.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతారని.. కానీ అణు ప్రయోగం చేసేవారు మాత్రం ట్రంప్‌ను విశ్వసించడం లేదన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పనికిరారని, అతను ఎంతో ప్రమాదమకరమైన వ్యక్తి అని అన్నారు.

డోనాల్డ్ ట్రంప్‌... తాను ఎన్నికైతే చట్టంలో సవరణలు చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలోకి మత్తు పదార్థాలు వెలువలా వస్తున్నాయి.. వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశ సరిహద్దులను పటిష్టం చేస్తానన్నారు. పన్నులు పెంచాలని హిల్లరీ అనుకుంటున్నారని.. దానివల్ల విపత్తు సంభవిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ హిల్లరీ ద్వేషిస్తోందని.. అలాగే పుతిన్‌ కూడా ఆమెను గౌరవించరన్నారు.పుతిన్‌ విషయంలో తనపై చేసిన ఆరోపణలను హిల్లరీ నిరూపించలగరా? అని సవాల్‌ చేశారు.

హిల్లరీ ప్రతిదానికీ రష్యాను బూచీగా చూపుతున్నారని మండిపడ్డారు. అయితే తాను ఎప్పుడూ పుతిన్‌ను కలవలేదని అన్నారు. అమెరికా ప్రభుత్వ సమాచారాన్ని హ్యాక్ చేస్తుంది.. రష్యానో, చైనానో తెలియదని అన్నారు. ఒబామా హయాంలో ఆర్థిక వ్యవ్యస్థ దిగజారిందని అన్నారు. ఒబామా, హిల్లరీ అడ్మినిస్టరేషన్ దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. వలసల పేరుతో ఒబామా కొన్ని లక్షల మందిని దేశం నుంచి పంపేశారని ఆరోపించారు. దీనిపై హిల్లరీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

30ఏళ్లు రాజకీయాల్లో ఉండి ఏం చేశారని హిల్లరీని నిలదీశారు. ఆమె అధికారంలో ఉన్న సమయంలో 600కోట్ల డాలర్లు మాయమయ్యాయని ఆరోపించారు. ఇక ఇప్పుడు హిల్లరీ అధ్యక్షురాలైతే ఏమవుతుందో? అంటే ఎద్దేవా చేశారు. తాను ఎన్నికైతే చట్టాల్లో మార్పులు తెస్తానని చెప్పారు. దేశంలో డ్రగ్స్ వెల్లువెత్తుతున్నాయని, వాటిని అరకట్టాల్సి ఉందన్నారు.

హిల్లరీ వలస విధానం దారుణంగా ఉందని అన్నారు. అమెరికా మీడియా అవినీతి మయమైపోయిందని మడ్డారు. హిల్లరీ 33వేల ఈ మెయిల్స్ డిలీట్ చేశారని, అసలు ఎఫ్ బీఐ దీనిపై ఏం చేస్తోందని ప్రశ్నించారు. అనేక విషయాల్లో అబద్ధాలు చెప్పిన హిల్లరీ ఇప్పటికే జైల్లో ఉండాలని అన్నారు. తనపై వస్తున్న లైంగిక ఆరోపణల్లో వాస్తవం లేదని, అవన్నీ పుకర్లేనని ట్రంప్ చెప్పుకొచ్చారు. తాను మహిళలను గౌరవించినంతగా, మరెవరూ గౌరవించరని అన్నారు.

హిల్లరీ..

ట్రంప్‌పై జాతీ వివక్ష ఆరోపణలున్నాయని హిల్లరీ అన్నారు. అంతేగాక, అక్రమంగా కోట్లు సంపాదించి పన్నులు చెల్లించడం లేదని ఆరోపించారు. అమెరికాలో డాక్యుమెంట్లు లేని వాళ్లలలో అమెరికాన్లు కూడా ఉన్నారని అన్నారు. వారు కూడా పన్నులు చెల్లిస్తున్నారని హిల్లరీ తెలిపారు. ట్రంప్ ఫౌండేషన్ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. తుపాకీ సంస్కతిని గౌరవిస్తా కానీ, దానిపై పరిమితులుండాలన్నారు.

రెండో రాజ్యంగ సవరణను తాను సమర్థిస్తానని హిల్లరీ చెప్పారు. మనకు పటిష్టమైన సరిహద్దులుండాలన్నారు. వికీలీక్స్ వెనుక రష్యా హస్తముందని, అమెరిక ప్రభుత్వం సమాచారాన్ని రష్యా హ్యాక్ చేస్తోందని ఆరోపించారు. చైనా వస్తువులు వద్దంటున్నారు కానీ, చైనా స్టీల్‌తో లాస్‌వేగాస్‌లో ట్రంప్ హోటల్ కట్టారని ఆరోపించారు. మహిళలను ట్రంప్ అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు.

కాగా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం ఎందుకు మద్దతుగా నిలవాలని అమెరికా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమెరికా రక్షణ ఒప్పందాలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ప్రపంచ దేశాలతో, ప్రధానంగా దక్షిణ కొరియా, జపాన్, సౌదీ అరేబియా దేశాలతో గతంలో కుదుర్చుకున్న రక్షణ ఒప్పందాలను సమీక్షిస్తానని అన్నారు. ఆ దేశాలు భరించాల్సిన భారాన్ని సైనిక శక్తిని మోహరించడం ద్వారా అమెరికా భరిస్తోందని, దానిని సమీక్షిస్తానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సౌదీ అరేబియాలకు మనం మద్దతుగా నిలవాల్సిందేనని అమెరికా డెమొక్రాట్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు. మిత్రదేశాల్లో సైన్యాన్ని మోహరించి, వారికి మద్దతుగా ఎందుకు నిలవాలని ట్రంప్ ప్రశ్నించడంతో హిల్లరీ గట్టిగా సమాధానం చెప్పారు.

Final Presidential Debate 2016: Trump: 'We have some bad hombres here

అమెరికా అగ్రదేశంగా, ప్రపంచంలో తిరుగులేని శక్తిగా నిలవాలంటే మిత్రదేశాలకు అండగా నిలవాలని ఆమె అన్నారు. మిత్రదేశాల సహాయ సహకారాలు తీసుకోవడమే కాకుండా, ఆయా దేశాలకు అండగా నిలవడం ద్వారా అమెరికా తన స్థాయిని నిలబెట్టుకుంటుందని ఆమె అన్నారు. అంతర్జాతీయ సంబంధాలను విశాల దృక్పథంతో చూడాలని ఆమె సూచించారు. అమెరికా ఎప్పుడూ ప్రపంచంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలనే భావిస్తుందని, అందులో భాగంగా జపాన్, కొరియా, యూరోపియన్, మిడిల్ ఈస్ట్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

జీడీపీలో భారత్ 8 శాతం వృద్ధి నమోదు చేస్తూ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్ బాటలోనే చైనా 6 శాతం జీడీపీ వృద్ధితో దూసుకుపోతోందని అన్నారు. అదే సమయంలో అమెరికా మాత్రం కేవలం 1 శాతం లేదా అంతకంటే తక్కువ శాతం జీడీపీ వృద్ధిరేటుతో వెనకబడిపోయిందని ట్రంప్ ఆరోపించారు. ఇలాగే అమెరికా విధానాలు కొనసాగితే దేశం ప్రమాదంలో పడుతుందని అన్నారు. ఇలాంటి విధానాలు సరికాదని, తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా జీడీపీ కొత్త పుంతలు తొక్కుతుందని ఆయన అన్నారు.

దీనికి సమాధానం ఇచ్చిన హిల్లరీ మాట్లాడుతూ, చైనా అభివృద్ధికి ఎవరు కారణం? అని ప్రశ్నించారు. చైనా నుంచి అవసరాలకు మించి ఇనుము, అల్యూమినియం తెచ్చుకుని హోటల్ నిర్మించిన చరిత్ర కలిగిన ట్రంప్ అమెరికాపై అంతులేని అభిమానం వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

అంతేగకా, ట్రంప్ కంపెనీల్లో చైనా ఉద్యోగులు ఎంత మంది ఉన్నారో బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ట్రంప్ కంపెనీల్లో అమెరికన్ల కంటే చైనీయులే ఎక్కువ మంది పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. ముందు ట్రంప్ కంపెనీల్లో అమెరికన్లకు ఉపాధి కల్పించాలని సూచించారు. విద్యావిధానాలను బలోపేతం చేయడం ద్వారా నాణ్యమైన గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసి, జీడీపీలో గణనీయమైన వృద్ధిరేటును సాధిస్తామని ఆమె స్పష్టం చేశారు.

హిల్లరీ హ్యాట్రిక్ హిట్.. ట్రంప్ ఫట్

మూడోదైన చివరి డిబేట్‌లోనూ హిల్లరీ ఆధిక్యం సాధించారు. ఆమెకు 52శాతం మద్దతు లభించగా, ట్రంప్‌కు మాత్రం 39శాతం మద్దతు లభించింది. కాగా, మొత్తం మూడు డిబెట్లలోనూ హిల్లరీనే ఆధిక్యం సాధించడం విశేషం. దీన్ని బట్టి చూస్తే కాబోయే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా హిల్లరీ నిలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి.

English summary
With just 19 days left for the United States to vote for its new President, Republican presidential nominee Donald Trump and Democratic presidential nominee Hillary Clinton will face each other in the final presidential debate for 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X