వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాది బలుపు కాదు! నిరుద్యోగానికి వలసలు కాదు, అసలు కారణాలివే!

2008వ సంవత్సరంలో అమెరికాలో రియల్ (ఎస్టేట్ బబుల్) హౌజింగ్ మార్కెట్ పతనమైంది. ఆ తర్వాత సంక్షోభం ఏర్పడింది. 2009లో బరాక్ ఒబామా వచ్చిన తర్వాత కొన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలిచ్చే ఏర్పాట్లు చేశారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్: 2008వ సంవత్సరంలో అమెరికాలో రియల్ (ఎస్టేట్ బబుల్) హౌజింగ్ మార్కెట్ పతనమైంది. ఆ తర్వాత సంక్షోభం ఏర్పడింది. 2009లో బరాక్ ఒబామా వచ్చిన తర్వాత కొన్ని స్టిమ్యులస్ ప్యాకేజీలిచ్చే ఏర్పాట్లు చేశారు. 2009 అనంతర కాలంలో క్రైసిస్ తగ్గిందని, దానికి తార్కాణంగా అమెరికాలో 2009 నాటికి నిరుద్యోగ శాతం 10-11శాతం ఉండగా, ఇప్పుడు 4-5శాతానికి చేరుకుంది కాబట్టి, అమెరికాలో నిరుద్యోగం తగ్గిందనే వాదన ఏర్పడింది. ఆ రకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుందని చెప్పుకునే క్రమంలో అమెరికా ఫెడరల్ బ్యాంకు కూడా సున్నా శాతానికి తగ్గించిన వడ్డీ రేట్లను క్రమంగా పెంచుకుంటూ వచ్చింది.

వచ్చే మార్చి నెలలో కూడా మరో దఫా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. అయితే వాస్తవాలను చూసుకున్నట్లయితే ఇది కాదని తెలుస్తోంది. ఎందుకంటే అమెరికాలో ఉద్దీపన పథకాల వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకున్నట్లు కనిపించిందే తప్ప, ఇది బలం కాదు, వాపే అని తెలుస్తోంది.

బలహీనంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ

బలహీనంగానే అమెరికా ఆర్థిక వ్యవస్థ

ఉదాహరణ తీసుకున్నట్లయితే ఈ రోజు నిరుద్యోగం 11శాతం నుంచి 4శాతానికి తగ్గిందనేది గుణాత్మకంగా కల్పించబడినదే. 2008-09 క్రైసిస్ టైంలో మధ్యతరగతి ఉద్యోగాలు పోయాయి. మళ్లీ ఈరోజు కనీస వేతనం మీద నడిచే ఉద్యోగాలు, పార్ట్ టైం ఉద్యోగాలు తిరిగి వస్తున్నాయి. అత్యంత తక్కువ స్థాయి ఉద్యోగాలు, దారిద్య్ర రేఖకు దిగువన అంటే ఏడాదికి 19వేల డాలర్లకు తక్కువగా ఉండే ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు కల్పించబడుతున్నాయి . ఇలాంటివి రెండు మూడు పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే తప్ప గడవని స్థితిలో అమెరికా జనం ఉన్నారు. పోయిన ఉద్యోగాలు మెరుగైనవి, మధ్య తరగతి ఉద్యోగాలైతే.. ఇప్పుడు వస్తున్నవి కిందిస్థాయి ఉద్యోగాలు. అదేగాక, అమెరికాలో ఇప్పుడు చాలా మంది ఉద్యోగాల వెతుకులాటను ఆపేశారు. ఎందుకంటే.. అవి రావని చాలా మందికి అర్థమైంది. దీంతో నిరాశకు గురై చాలా మంది డ్రాపైపోయారు. ఈ సంఖ్య కూడా నిరుద్యోగుల సంఖ్యలో గుణించ బడటం లేదు. ప్రధానమైన బలహీనతల వల్ల అమెరికాలో నిరుద్యోగం తగ్గిందని చెబుతున్నారు కానీ, వాస్తవానికి అమెరికా ఆర్థిక వ్యవస్థ స్థాయి బలహీనంగానే ఉంది. అందుకే ఈరోజు తగ్గినటువంటి నిరుద్యో స్థాయి చూపించి వడ్డీ రేట్లను మళ్లీ పెంచుతున్నారు.

ఉద్యోగాలు తెస్తానని ట్రంప్..

ఉద్యోగాలు తెస్తానని ట్రంప్..

కొంత కాలం తర్వాత మళ్లీ నిరుద్యోగ సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఎన్నికల సమయంలో.. మన ఉద్యోగాలను చైనావాళ్లు, మెక్సికో వాళ్లు కాజేసుకుపోతున్నారని లక్షలాది మంది నిరుద్యోగులకు చెప్పాడు ట్రంప్. సులువుగా, వినసోంపుగా ట్రంప్ మాటలు ఉండటంతో నిరుద్యోగ సమస్య ఎందుర్కొంటున్న అమెరికాలోని యువత భారీగా ఓట్లు వేసి ట్రంప్ ను గెలిపించారు.
ఉద్యోగాలను తిరిగి తెస్తానన్నందుకే ప్రజలు ఆయనను గెలిపించారు. అంతేగాక, మెక్సికో వైపు గోడ కడతానని అన్నాడు.. చైనా వల్ల కోల్పోయిన ఉద్యోగాలను కూడా తెప్పించే విధంగా చర్యలు చేపడతానన్నారు. వాస్తవానికి ఇదంతా ఒక డైవర్షన్.. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చేసింది గానీ, ప్రస్తుతం అమెరికాలో ఇమ్మిగ్రెంట్స్ మీద ట్రంప్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం.. నిన్నగాక మొన్న భారతీయుడు శ్రీనివాస్ హత్యకు, అలోక్ అనే ఇంజినీర్ గాయపడటానికి కారణమైన కాల్పుల ఘటనకు ట్రంప్ ప్రభావమేనని తెలుస్తోంది. అయితే వైట్ హౌజ్ మాత్రం దాన్ని తిరస్కరిస్తోంది. ట్రంప్ మాటలకు జరిగిన ఘటనలకు సంబంధం లేదని తెలిపింది. ప్రపంచంలో అందరికీ.. ఈ(శ్రీనివాస్) హత్యకు ట్రంప్ విద్వేషకర వ్యాఖ్యలకు సంబంధం ఉందనే అనిపిస్తోంది.

వలసల వల్లే.. బ్రెగ్జిట్

వలసల వల్లే.. బ్రెగ్జిట్

వాస్తవాలు చూసుకున్నట్లయితే అమెరికాలో నిరుద్యోగానికి కారణం విదేశీయులు రావడమేనా? అనే ప్రశ్న ఉంది. అయితే, అమెరికానే ప్రవాసితుల దేశం. మొత్తంగా అక్కడ రెడ్ ఇండియన్ల స్థానంలో ప్రపంచ జాతుల వారు.. ముఖ్యంగా, బ్రిటన్, యూరప్ కు చెందిన నివాసం ఉండటం మొదలుపెట్టారు. ఇప్పుడు వలసలు వస్తున్నారంటూ మాట్లడటం హాస్యాస్పదం. అయితే, నిరుద్యోగ సమస్యను తగ్గిస్తానంటున్న ట్రంప్.. ఎంత వరకు తన మాటను నిలబెట్టుకోగలడు? అనేది ప్రశ్నార్థకమే. వలసల వల్లే అమెరికాలో స్థానికులకు ఉద్యోగాలు పోతున్నాయనేది వాస్తవం కాదు. గత సంవత్సరం జరిగిన బ్రెగ్జిట్ గురించి విశ్లేషించినట్లయింతే.. బ్రిటన్లోకి పేద యూరోప్ దేశాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయనే కారణంగానే ఈ బ్రెగ్జిట్ జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై రెఫరండం నిర్వహిస్తే మెజార్టీ ప్రజలు బ్రెగ్జిట్ కోసమే ఓటు వేశారు. దీంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అయింది. అంటే బయటికి వచ్చింది. ఇక్కడ కూడా బ్రిటన్ ప్రజలు.. యూరోపియన్ పేద దేశాల నుంచి ఎక్కువగా బ్రిటన్‌కు వలసలు రావడం వల్లే తమ ఉద్యోగాలు పోతున్నాయని భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బ్రెగ్జిట్ తప్పలేదని తెలుస్తోంది.

ఫ్రాన్స్‌లోనూ...

ఫ్రాన్స్‌లోనూ...

రోజు ఫ్రాన్స్ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. 2005-06 కాలంలోఫ్రాన్స్‌లో జాతి విద్వేషాల వల్ల పెద్ద ఎత్తున అల్లర్లు కూడా చెలరేగినాయి. ఈ క్రమంలో ఫ్రాన్స్ దేశంలో మితవాద పార్టీల ప్రభావం.. మెరిన్ లిపెన్ అనే ఫ్రాన్ రాజకీయ పార్టీ నేత ఆధ్వర్యంలో పెరగడం జరుగుతోంది. ఇతర యూరోపియన్ దేశాల్లో కూడా వలసదారుల వల్లే తమ దేశంలో ఉద్యోగాలు పోతున్నాయని ప్రజలు భావిస్తుండటం గమనార్హం. ఈ క్రమంలో యూరోప్ దేశాల్లో మిత ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రవాసులు లేకున్నా.. నిరుద్యోగం పెరుగుతోంది

ప్రవాసులు లేకున్నా.. నిరుద్యోగం పెరుగుతోంది

చాలా చోట్ల జరుగుతున్న ఈ పరిణామాలే.. ట్రంప్ ఆధ్వర్యంలో అమెరికాలో పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. అమెరికాలో గానీ, ఇతర యూరోప్ దేశాల్లో గానీ నిరుద్యోగానికి ప్రవాసితులు, వలసదారులే కారణం అనుకుంటే.. ఎలాంటి ప్రవాసులు లేని భారతదేశంలో కూడా నిరుద్యోగం పెరుగుతుండటం గమనించాల్సి ఉంటుంది. చైనాలో కూడా నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. జపాన్ దేశంలో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే ఉంది. ప్రవాసితులు లేని దేశాలు, తక్కువగా ఉన్న దేశాల్లో కూడా నిరుద్యోగ సమస్య తీవ్రంగానే ఉంది.

నిరుద్యోగానికి అసలు కారణం ఇదే..

నిరుద్యోగానికి అసలు కారణం ఇదే..

నిరుద్యోగం పెరిగిపోతోందంటూ.. అమెరికా, బ్రిటన్ దేశాలకు ప్రవాసులు రావొద్దని చెప్పడంలో సరైన తత్వం లేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రవాసులు పెరగడం వల్ల అమెరికా, బ్రిటన్ల లాంటి దేశాల్లో నిరుద్యోగం పెరుగుతుందనే వాదన సరైనది కాదని తెలుస్తోంది. మరికా కారణం ఏంటని చూసుకున్నట్లయితే.. మనకు స్పష్టంగా కనబడే ఏకైక కారణం ఏమంటే.. ప్రపంచ వ్యాప్తంగా సైంటిఫిక్ టెక్నాలజీ విప్లవంలో భాగంగా పెరుగుతున్న హై టెక్నాలజీ అనే చెప్పవచ్చు. ఇందులో భాగంగానే ఆటోమేషిన్, రోబోటైజేషన్ పెరిగిపోతుండటం వల్లే ఉద్యోగావకాశాలు తగ్గి.. నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్నట్లు స్పష్టమవుతోంది. కేవలం మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాల పైనా కాకుండా సర్వీస్, బీపీఓ, ఐటీ సెక్టార్లలో కూడా దీని ప్రభావం భారీ ఎత్తున పడుతోంది. దీంతో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాల కల్పన పడిపోవడం, ఉన్న ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆటో మేషిన్ వల్ల అమెరికాలో వచ్చే దశాబ్దకాలంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంది. వచ్చే పదేళ్ల కాలంలో ఆటోమేట్, రోబోటైజేషన్ చేసే అవకాశాలుండటంతో 47శాతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఓ సర్వేలో తేలింది. అలాగే భారతదేశంలో ఆటోమేట్, రోబైటేజేషన్ చేయడానికి ఉన్న ఉద్యోగాల సంఖ్య 69శాతంగా ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే చాలా పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఔట్ సోర్సింగ్.. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చైనాకు, సర్వీస్ సెక్టార్లోని ఉద్యోగాలు భారతదేశంకు వెళ్లిపోయాయంటూ విన్నాం. అది నిజమే. సర్వీస్ సెక్టార్లలోని ఉద్యోగాలు ఎక్కడికైతే వెళ్లాయో.. భారతదేశంలో కూడా సర్వీస్ సెక్టార్లో పెద్దగా ఉపాధి కల్పన పెరగడం లేదు. సాఫ్ట్ వేర్ రంగం కూండా కొంత ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. షేర్ మార్కెట్లను గమనిస్తే ఈ విషయం తెలుస్తోంది. ఓవరాల్ గా సర్వీస్ సెక్టార్‌లో ఔట్ సోర్సింగ్‌కి హబ్‌గా, ఫ్రంట్ ఆఫీస్‌గా తయారైంది భారతదేశం. దీనిలో కూడా కూడా సర్వీస్ సెక్టార్లో గతంలో సరిగా పెరగకపోవడం గానీ, కొన్ని చోట్ల సింక్ అవడం గానీ జరుగుతోంది.

డైవర్షన్ టాక్‌టిక్ మాత్రమే..

డైవర్షన్ టాక్‌టిక్ మాత్రమే..

ఉదాహరణకు భారతదేశంలో సర్వీస్ సెక్టారే కాకుండా ఓవరాల్‌గా రోజువారీగా 550 ఉద్యోగాలు నికరంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ క్రమం మరింత వేగం పుంజుకుంటుంది. రోజువారీగా కల్పించడబడే ఉద్యోగాల సంఖ్యతో పోల్చితే 550 ఉద్యోగాలు నెగిటివ్‌గా పోతున్నాయని తెలుస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి.. ఇది ప్రవాసితుల వల్లే జరుగుతుందనడం ఎలాంటి వాస్తవం లేదు. అమెరికాలో, బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో ప్రవాసులతో ఉద్యోగాలు పోతున్నాయంటే.. బోడి గుండికి మోకాలికి ముడిపెట్టడం లాంటి వాదనలే తప్ప వాస్తవాలు కాదు. నిజానికి ఇది ఎంటంటే.. ఓ డైవర్షన్ టాక్ టిక్. బ్రెగ్జిట్‌లో జరిగినా కానీ, ఈ రోజు ట్రంప్ గెలిచిన తర్వాత హెచ్1 వీసాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలు, మెక్సికోకు గోడ కట్టి ఇమ్మిగ్రెంట్స్ రాకూడదనే వాదన కానీ, చైనాపై వెళ్లగక్కుతున్న అక్కసులో గానీ హేతుబద్ధత కంటే.. అసహేతుకమైన వాదనలే ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఉద్యోగాలు పోవడానికి కారణం ఇది కాదు.. ఆటోమేషన్ అనేది సుస్పష్టం. మరి ఇప్పుడెందుకు ఆటోమేషిన్ వైపు పాయింటవుట్ చేయకుండా ఉద్యోగాల్ని ప్రవాసితుల వల్లే పోతున్నాయని చెబుతున్నారంటే.. ఆటో మేషిన్ వల్లే ఉద్యోగాలు పోతున్నాయంటే.. మీరేం చేస్తున్నారంటూ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఉంది.

ప్రాఫిట్ ఓరింటెడ్ ఎకానమీ..

ప్రాఫిట్ ఓరింటెడ్ ఎకానమీ..

ఆటో మేషిన్ వల్ల ఉద్యోగాలు పోవడమేంటి? రోబోటైజేషన్ అనేది మనుషుల శ్రమను తగ్గించడానికే కదా అనే వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. ఆటోమేషిన్, రోబోటైజేషన్ వల్ల ప్రజలెందుకు ఇబ్బందులు పడుతున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలు ఎందుకు పతనమవుతున్నాయి? సంక్షోభం ఎందుకు ఏర్పడుతుంది? ఉద్యోగాలు ఎందుకు పోతున్నాయంటే? దీనికంతటికి ప్రాఫిట్ ఓరింటెడ్‌గా నడిచే ఎకానమీయే దీనికి కారణం. ఎక్కడైనా, ఎవరైనా పారిశ్రామికవేత్తలు కొత్తగా ఉద్యోగాలు కల్పించేదానికంటే కూడా ఆయన ఆలోచన ప్రధానంగా లాభాలపైనే ఉంటుంది. ఉద్యోగాల కల్పన అనేది సెకండరీగా జరిగేది. లాభాల కల్పన కోసం పెట్టుబడులు పెడుతున్నాడు కాబట్టి.. లాభాల కోసం కార్మికుల కంటే ఎక్కువగా యంత్రాలను, రోబోట్స్, ఆటో మేషన్‌ను ఉపయోగించేందుకే మొగ్గుచూపుతాడు. ఏవైతే ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తాయో వాటినే కోరుకుంటాడు. 1970-80లలో ప్రారంభంలో ప్రపంచంలోకి వచ్చిన రోబోటో, ఆటోమేషిన్ ఒక్కటి మూడు ఉద్యోగాలను పోగొట్టిందని తెలుస్తోంది. రోబోట్ మీద పెట్టిన పెట్టుబడి 18నెలల్లోని యజమానికి తిరిగి వస్తుంది. ఉద్యోగులను పెట్టుకుంటే లైఫ్ లాంగ్ జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. యంత్రాలైతే ఆ అవసరం ఉండదు. ఈ క్రమంలోనే సాధ్యమైనంత మేర ఆటోమేషిన్‌తో లాభాలు పొందేందుకు పారిశ్రామిక వ్యవస్థ ఉంది. ఈ వాస్తవాన్ని అంగీకరించదు పెట్టుబడిదారి వర్గం.

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్యమాలు

ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఉద్యమాలు

అమెరికాలోట్రంప్ లాంటి మల్టీ మిలియనీర్, బిజినెస్ పీపుల్ తాలూకూ రాజకీయవేత్త లాంటి వారిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ట్రంప్ ఆలోచనల వెనక ఉన్న ఇంకో కారణం గనుక చూస్తే.. 2008లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ముదురుతున్న క్రమంలో అమెరికా ప్రజల్లో తీవ్రమైన అలజడి, ఆందోళన ఏర్పడి.. దీనంతటికి కారణం ఏంటని ఆలోచించి.. 2011లో వీఆర్ ది 99శాతం పేరుతో అక్యుపై వాల్ స్ట్రీట్ అనే ఉద్యమాన్ని నడిపారు. ఈ ఉద్యమం అర్థమేమిటంటే.. అమెరికాలోని సామాన్య జనం మేము.. ఈ దేశంలోని అత్యధికులం.. ఎవరైతే పని చేసుకుని బతుకుతున్నారో.. ఎవరైతే సామాన్య జనంగా ఉన్నారో.. ఎవరైతే మధ్యతరగతిగా ఉన్నారో.. వీళ్లందరం కలిపితే 99శాతం శ్రమను నమ్ముకుని బతుకుతున్నామని వెల్లడించారు. మిగితా 1శాతం అంటే వాల్ స్ట్రీట్ పెద్ద మనుషులు, ధనవంతులు. ఈ తేడాను అమెరికా ప్రజలు గుర్తించగలిగారు. వాల్ స్ట్రీట్ పెద్ద మనుషుల దురాశ వల్లే 99శాతం మంది ప్రజలం ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు గుర్తించారు. దీన్ని ప్రతిఘటించడం కోసమే అక్యుపై వాల్ స్ట్రీట్ ఉద్యమాన్ని తెచ్చారు. ఈ ఉద్యమాన్ని ప్రపంచ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా గమనించారు. ఇలాంటి ఉద్యమాలు ప్రపంచంలోని 800 నగరాలకు వ్యాపించాయి. అక్యుపై దలాల్ స్ట్రీట్ పేరుతో బాంబేలో కూడా జరిగింది ఇలాంటి ఉద్యమం. ప్రపంచ ప్రజానీకం స్పష్టంగా తమ కష్టానికి కారణం ఏంటో చూడగలిగే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే వాల్ స్ట్రీట్ ఉద్యమం భారీగా ఎగిసిపడి ఆ తర్వాత కొంత తగ్గినట్లు కనిపించింది. అయితే, ఉద్యమ ప్రభావం మాత్రం అమెరికా సొసైటీ మీద చాలా చూపింది. ముఖ్యంగా అమెరికా యువజనుల్లో చాలా పెద్ద ఎత్తు మార్పు వచ్చింది.అమెరికాలోని జాతి వివక్ష,ఇమ్మిగ్రెంట్స్ పట్ల వ్యతిరేకత వంటి ప్రస్తుత పరిణామాలు దేశ ప్రజల ఐక్యతను దెబ్బ తీసే ప్రయత్నాల్లో భాగంగానే జరుగుతున్నాయి. తద్వారా ప్రజల దృష్టిని ఒక శాతం ఉన్న పెట్టుబడిదారుల నుంచి, లాభాపేక్షాపరుల నుంచి మళ్లించడానికే.

-ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు డీ పాపారావు

English summary
Famous Financial Analyst Papa Rao described about America economy and immigration policies and falling of jobs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X