వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సేషనల్ ప్రధాని సంచలన నిర్ణయం: రోజుకు 6 గంటలు.. వారానికి 4 రోజుల పని.. బంఫర్ ఆఫర్‌తో

|
Google Oneindia TeluguNews

Recommended Video

PM Calls For 4 Day Working Week And 6 Hour Workdays || Oneindia Telugu

ఉద్యోగుల పనివేళల విషయంలో ఫిన్‌లాండ్ ప్రధాని సన్నా మారిన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దేశ పౌరులకు సులభతరమైన.. పని ఒత్తిడికి దూరంగా ఉండేలా ఉపశమనం కలిగిస్తూ పనివేళలను, పని దినాలను కుదిస్తూ నిర్ణయం తీసుకోవడం ప్రపంచవ్యాప్తంగా మీడియా దృష్టిని ఆకర్షించింది. అయితే ఉద్యోగులు తమ కుటుంబాలతో క్వాలిటీ సమాయాన్ని గడిపేలా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నానంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

కుటుంబాలతో ఉద్యోగులు

కుటుంబాలతో ఉద్యోగులు

ఫిన్ లాండ్ ప్రభుత్వం వారానికి 4 రోజులు.. రోజుకు 6 గంటలు పనిచేసేలా ఉద్యోగులకు వెసులుబాటు కల్పించింది. ఇష్టమైన వ్యక్తులు, కుటుంబాలతో ఆహ్లాదంగా ఎక్కువ సమయాన్ని గడిపే విధంగా.. అలాగే తమ వ్యక్తిగత అభిరుచులు, హాబీలకు సమయం కేటాయించుకొనేలా, సంస్కృతి, జీవితంలోని విభిన్న కోణాలను సృశించే విధంగా ఉద్యోగులకు వెసలుబాటు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నది అని ప్రధాని సన్నా మారిన్ మీడియాతో పంచుకొన్నారు.

గతంలో పనివేళలు ఇలా..

గతంలో పనివేళలు ఇలా..

ఇక ఫిన్‌లాండ్‌లో ఇప్పటి వరకు వారానికి ఐదు రోజులు, ప్రతీ రోజు ఎనిమిది పని గంటలు ఉండేవి. వర్కింగ్ లైఫ్‌ విషయంలో ఈ నిర్ణయం మరో లెవెల్‌కు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల్లో మెరుగైన పనితీరును ఆశించవచ్చు అని సన్నా మారిన్ పేర్కొన్నారు. ప్రధాని నిర్ణయం తీసుకొన్న నిర్ణయంపై దేశ పౌరుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది.

ఎన్నికల హామీని అమలు చేస్తూ

ఎన్నికల హామీని అమలు చేస్తూ

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకొన్నారు అని విద్యాశాఖ మంత్రి లీ అండర్సన్ అన్నారు. ఫిన్‌లాండ్ పౌరుల్లో పనితీరును మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తోడ్పాటునందిస్తుందన్నారు. 2015లో స్వీడన్‌లో రోజుకు ఆరు గంటల పనివేళలను ప్రవేశపట్టగా మంచి ఫలితాలు వచ్చాయని, ఉత్పత్తిపరంగా కూడా వృద్ధి కనిపించింది. ఉద్యోగులు చాలా హ్యపీగా ఉన్నారు అని పేర్కొన్నారు.

సన్నా మారిన్ సంచలన రికార్డు

సన్నా మారిన్ సంచలన రికార్డు

ఇక సన్నా మారిన్ ఇటీవలే అరుదైన రికార్డును క్రియేట్ చేశారు. ప్రపంచంలోనే అతిపిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ప్రధాని పదవి చేపట్టడానికి ముందు రవాణాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో కూడా పనివేళలను కుదిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు.

English summary
Finland PM Sanna Marin sensational decision on Work hours and Working days per week. She calls calls for 4-day, 6-hour working week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X