వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన.. యాక్టర్ మహేశ్ బాబు విచారం (VIDEO)

|
Google Oneindia TeluguNews

Recommended Video

అమెజాన్ అడవులు కాలిపోతున్నాయి.. ఆక్సిజన్‌పై ఆందోళన..!!(వీడియో)

బ్రెజిల్ : అమెజాన్ అడవులు కాలి బూడిదవుతున్నాయి. దాదాపు పదిహేను రోజులకు పైగా మంటలు వ్యాపిస్తుండటంతో అడవి దగ్థం అవుతోందనే వార్తలొస్తున్నాయి. వేలాది హెక్టార్లలో విస్తరించిన చెట్లు అగ్ని ధాటికి మండిపోతున్నాయి. ఆ క్రమంలో దక్షిణ అమెరికా దేశాల్లోని చాలా ప్రాంతాల్లో పొగ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే అమెజాన్‌లో దాదాపు 73 వేల అగ్ని ప్రమాదాలు సంభవించాయని బ్రెజిల్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఐఎన్‌పీఈ వెల్లడించింది. గడచిన ఐదేళ్లలో అగ్నిప్రమాదాల సంఖ్య 83 శాతం పెరిగడం గమనార్హం.

మంటల్లో అమెజాన్ అడవులు.. మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అక్కడిదే..!

మంటల్లో అమెజాన్ అడవులు.. మానవాళికి 20 శాతం ఆక్సిజన్ అక్కడిదే..!

గత కొన్నాళ్లుగా అమెజాన్ అడవుల్లో మంటల ధాటికి చెట్లు కాలి బూడిదవుతున్నాయి. మానవ తప్పిదాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయనేది పర్యావరణవేత్తలు చెబుతున్న మాట. అడవుల్లో చెట్లను ఇష్టారాజ్యంగా కొట్టేయడం కూడా ప్రమాద తీవ్రతను మరింత పెంచుతోందనే ఆరోపణలున్నాయి. ఇప్పటి సీజన్‌లో అధిక ఉష్ణోగ్రతతో పాటు తక్కువ స్థాయిలో ఉండే ఆర్థ్రత కారణంగా అడవిలో మంటలు సాధారణమే అయినప్పటికీ.. ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు సంభవించడం ఆందోళన కలిగించే పరిణామమే.

అమెజాన్ అడవుల్లో రికార్డ్ స్థాయి మంటలు చెలరేగాయనే దానికి నిదర్శనంగా నాసా శాటిలైట్ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 శాతం ఆక్సిజన్ అందించడానికి ఆధారంగా నిలుస్తున్న అమెజాన్ అడవులు ఇప్పుడు కాలి బూడిద అవుతుండటం భయాందోళనకు గురి చేస్తోంది.

<strong>ఎలుకలు బాబోయ్.. అక్కడ భయపడటం లేదు.. కొనుక్కొంటున్నారు..!</strong>ఎలుకలు బాబోయ్.. అక్కడ భయపడటం లేదు.. కొనుక్కొంటున్నారు..!

నాసా శాటిలైట్ ఫోటో.. పర్యావేరణవేత్తల ఆందోళన..!

భూగోళానికి అధిక స్థాయిలో ప్రాణ‌వాయువును అందించే అమెజాన్ అడ‌వులు ఇలా కాలి బూడిద అవుతుండటాన్ని చూసి పర్యావేరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. సౌత్ అమెరికా బ్రెజిల్ ప్రాంతంలోని ఈ అడవులు ప్రతి యేటా రికార్డు స్థాయిలో దగ్ధం అవుతుండటం ప్రాణ వాయువుపై భయాందోళన పుట్టిస్తోంది. నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ రీస‌ర్చ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక కూడా ఇదే విషయం తేటతెల్లం చేస్తోంది. అమెజాన్ అడ‌వుల్లో చెట్లను నరికివేయడం ఎక్కువైన‌ట్లు ఆ రిపోర్టులో పేర్కొంది. అదలావుంటే ఆ దేశాధ్య‌క్షుడు జెయిర్ మెస్సియాస్ బొల్స‌నారో ఖండించారు.

ఊపిరితిత్తుల్లాంటి అడవులు కాలిపోతుండటం బాధాకరం : ప్రిన్స్ మహేశ్ బాబు

అమెజాన్ అడవులు పెద్ద ఎత్తున కాలిపోతున్నట్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో తెలుగు సినిమా నటుడు ప్రిన్స్ మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వార్త నిజంగా దురద‌ృష్టకరమని పేర్కొన్నారు. ప్రపంచానికి 20 శాతం ఆక్సిజన్ అందిస్తున్న అమెజాన్ అడవులు కాలి బూడిద అవుతుండటం ఆందోళన కలిగించే విషయమని ట్వీట్ చేశారు. మానవ మనుగడకు కారణమైన ప్రాణ వాయువు అందించడంలో అమెజాన్ అడవుల పాత్ర వెలకట్టలేనిదని అన్నారు.

భూమండలానికి లంగ్స్ లాంటి అమెజాన్ అడవులు కాలిపోతుండటం విచారకరం. అపారమైన జీవవైవిధ్యం విలవిల్లాడుతోందని.. భూమాతను కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరం తమ వంతుగా ఏదైనా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చదనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని.. అలాంటి కార్యక్రమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

English summary
There have been more than 72,000 fire outbreaks in Brazil so far this year, up 84% on the same period in 2018, according to the country’s National Institute for Space Research. More than half were in the Amazon. It followed reports that farmers were feeling emboldened to clear land for crop fields and cattle ranches because the new Brazilian government was keen to open up the region to economic activity. The Brazilian president, Jair Bolsonaro, instead accused environmental groups of starting fires
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X