• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్: ప్రజావసరాల కోసం అందుబాటులో: మాస్ వ్యాక్సినేషన్‌కు రెడీ

|

మాస్కో: ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి కనిపెట్టిన మొట్ట మొదటి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసింది. ఫస్ట్ బ్యాచ్ కోవిడ్ వ్యాక్సిన్‌‌ మార్కెట్‌లో అడుగు పెట్టింది. ప్రజల అవసరాల కోసం దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేశారు.

ఆ వ్యాక్సిన్.. స్పుత్నిక్-వీ. రష్యా దీన్ని తయారు చేసింది. స్పుత్నిక్-వీ ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్‌ను బహిరంగ మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. రాజధాని మాస్కో మేయర్ సెర్గీ సొబ్యానిన్ ఫస్ట్‌బ్యాచ్ వ్యాక్సిన్‌ను విడుదల చేశారు.

బెంగళూరులో కరోనా పేషెంట్లు లేరట: దేశంలోనే అతిపెద్ద కోవిడ్ కేర్ సెంటర్ క్లోజ్: లక్షన్నరకు

కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన మొట్టమొదటి దేశంగా రష్యా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కోవిడ్ వ్యాక్సిన్ డెవలపర్‌గా కిందటి నెల 11వ తేదీన తన పేరును రిజిస్టర్ చేసుకుంది. కరోనా వ్యాక్సిన్‌ను మొదటిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెపై దీన్ని ప్రయోగించారు. అది విజయవంతమైనట్లు అప్పట్లోనే రష్యా ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ ఏ మేరకు కరోనా వైరస్ సోకిన పేషెంట్లపై ప్రభావం చూపుతుందనే విషయంపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ.. రష్యా వెనకడుగు వేయలేదు. ఊహించినట్టే స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

First Batch Of Russias Covid19 Vaccine Sputnik V Released Into Public circulation

రష్యాకు చెందిన గమేలియా నేషనల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సెంటర్ ఆప్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సంయుక్తంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం రాజధాని మాస్కోలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దశలవారీగా రష్యావ్యాప్తంగా దాన్ని సరఫరా చేస్తారు. దీనికోసం ఓ బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేసినట్లు రష్యా వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ.. వాటిని మిగిలిన ప్రాంతాలకు సరఫరా చేస్తామని అన్నారు.

  Rajnath Singh Meets Wei Fenghe చైనా రక్షణ మంత్రితో డ్రాగన్ తీరును ఏకిపారేసిన రాజ్‌నాథ్ || Oneindia

  గ్యామ్-కోవిడ్-వ్యాక్‌ అభివృద్ధి చేసినట్లు రష్యా పేర్కొంది. దీనికి స్పుత్నిక్-వీ అనే బ్రాండ్‌నేమ్ ఇచ్చింది. రెండు దశల్లో క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తరువాత.. కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన తొలి దేశంగా రష్యా తన పేరును రిజిస్టర్ చేసుకుంది. వ్యాక్సిన్‌ను విడుదల చేసిన సందర్భంగా మాస్కో మేయర్.. భవిష్యత్ యాక్షన్ ప్లాన్‌ను వెల్లడించారు. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఇక సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై దృష్టి పెడతామని అన్నారు. మాస్ వ్యాక్సినేషన్‌ కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరిలో లేదా.. వచ్చే ఏడాది ప్రారంభంలో మాస్కోలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

  English summary
  The first batch of Sputnik V vaccine against coronavirus, developed by Russia's Gamaleya National Research Center of Epidemiology and Microbiology and the Russian Direct Investment Fund (RDIF) has been released into civil circulation, the Russian Health Ministry informs.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X