వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19 తొలి కేసుపై ముందుగా మాకు అక్కడి నుంచే నివేదిక వచ్చింది: WHO

|
Google Oneindia TeluguNews

జెనీవా: కరోనావైరస్ గురించి ముందుగా తమను అలర్ట్ చేసింది చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తప్ప చైనా ప్రభుత్వం కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వూహాన్‌లో తొలి కేసు నమోదైందని హెడ్‌ క్వార్టర్స్‌కు చైనాలోని కార్యాలయం తెలిపిందని పేర్కొంది. చైనాతో ప్రపంచ ఆరోగ్యసంస్థ అంటకాగుతోందని పదే పదే అమెరికా అధ్యక్షుడు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదని వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్యసంస్థపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నాడు జరిగిన సంభాషణల సమయంకు సంబంధించి ఏప్రిల్ 9న డబ్ల్యూహెచ్‌ఓ ప్రచురించింది. ఇక ప్రపంచఆరోగ్య సంస్థ ప్రచురించిన టైమ్‌లైన్ చూస్తే ముందుగా హూబే ప్రావిన్స్ ‌లోని వూహాన్ నగరంలో డిసెంబర్ 31న తొలి న్యుమోనియా కేసు నమోదైనట్లు వారికి సమాచారం అందిందని పేర్కొంది. అయితే తమ దృష్టికి ఎవరు తీసుకొచ్చారనేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలి కేసుపై చైనా నుంచే తమకు రిపోర్టు అందిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్ ఏప్రిల్ 20వ తేదీన జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. దీన్నే ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తూ వచ్చారు.

First case of covid-19 was reported from Chinas WHO office: WHO

Recommended Video

Coronavirus Vaccine : India's Second COVID-19 Vaccine Produced By Zydus Cadila || Oneindia Telugu

అయితే కొత్తగా ప్రచురించిన టైమ్ లైన ప్రకారం చైనాలోని తమ కార్యాలయం నుంచి వూహాన్‌లో వెలుగు చూసిన తొలి కరోనావైరస్ కేసు తమ దృష్టికి వచ్చిందని ఉంది. ప్రస్తుతం కరోనావైరస్ తొలిదశలో ఉందని రెండవ దశకు చేరుకుంటే ప్రమాదకరంగా పరిస్థితి మారుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ అత్యవసర విభాగపు అధిపతి డాక్టర్ ర్యాన్ చెప్పారు. తొలి దశలో ఉండగానే ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకుంటే అది రెండో దశకు చేరుకునే సమయానికి పూర్తిగా మెరుగైన స్థితిలో ఉంటామని డాక్టర్ ర్యాన్ చెప్పారు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య వేగంగా పెరుగుతోందని డాక్టర్ ర్యాన్ వెల్లడించారు. మొత్తం ప్రపంచంలో 11.1 మిలియన్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా నుండి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య ఐదు మిలియన్లను దాటింది.

English summary
WHO said that the first Covid-19 case was reported from its China office and not China itself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X