• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుడ్ న్యూస్: కరోనా విరుగుడుకు ఆ వ్యాక్సిన్‌‌ ప్రయోగం సక్సెస్... అక్టోబర్ నాటికల్లా..!

|

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనావైరస్‌ విరుగుడుకు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో ఉన్నాయి. అయితే మోడర్నా అనే బయోటిక్ సంస్థ వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు కొంతమందిపై ప్రయోగం చేయగా అది సత్ఫలితాలను ఇచ్చినట్లు తెలిపింది. ఈ వ్యాక్సిన 45 మందిపై ప్రయోగించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ వ్యాక్సిన్‌ను నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిజీస్‌లో తొలుత తయారు చేసి ఆ తర్వాత మనుషులపై పరిశోధకులు ప్రయోగించారు.

 వైరస్‌ను అడ్డుకోనున్న వ్యాక్సిన్

వైరస్‌ను అడ్డుకోనున్న వ్యాక్సిన్

ఇక మూడో దశలో పరీక్షలను జూలై 27 నిర్వహిస్తామని అప్పుడు 30వేల మందిపై వ్యాక్సిన్ ఇచ్చి ప్రయోగం చేస్తామని పరిశోధకులు చెప్పారు. ఇక క్లినికల్ ట్రయల్స్ అక్టోబర్ నెలకల్లా పూర్తి చేస్తామని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఈ వ్యాక్సిన్ ఎంతమేరకు సురక్షితమో , ఏమేరకు ప్రభావం చూపగలదో ఆ కొంత సమయంలో కచ్చితంగా చెప్పలేమనే వాదనా వినిపిస్తోంది. ఇక ఈ వ్యాక్సిన్ ప్రయోగం ద్వారా ప్లేసిబో పొందిన వారికంటే వైరస్ బారిన పడే వారి అవకాశం చాలా తక్కువగా ఉందని నిరూపించాల్సి ఉంటుంది. ఫలితాలు త్వరగా వచ్చేందుకు కరోనావైరస్ హాట్‌స్పాట్‌‌గా గుర్తించిన ప్రాంతాల్లో నివాసం ఉండే మనుషులపై ప్రయోగించాలని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు అలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు.

 ఒక్క వ్యాక్సిన్ మాత్రమే సరిపోదు

ఒక్క వ్యాక్సిన్ మాత్రమే సరిపోదు

ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ బారి నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సిన్‌లు లేదా సరైన చికిత్స మాత్రమే రావాల్సి ఉంది. ఇందుకోసం ఎన్నో కంపెనీలు వ్యాక్సిన్‌ను రూపొందించే పనిలో పడ్డాయి. ఇదిలా ఉంటే ఒక్క వ్యాక్సిన్‌తో ఈ మహమ్మారిని అంతం చేయలేమని మరికొన్ని వ్యాక్సిన్‌లు రావాలని నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఒక్క కంపెనీ బిలియన్ డోస్‌లలో వ్యాక్సిన్‌ను తయారు చేయలేదని చెబుతున్నారు ఇక మోడర్నా వ్యాక్సిన్ తయారీలో జన్యు పదార్థాలను వినియోగించారు. దీన్నే ఎం‌ఆర్ఎన్ఏగా పిలుస్తున్నారు. ఇది కరోనావైరస్‌తో పోరాడగలిగే వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

45 మందిపై చేసిన ప్రయోగం సక్సెస్

45 మందిపై చేసిన ప్రయోగం సక్సెస్

మే నెలలోనే దీని గురించి మోడర్నా కంపెనీ చెప్పినప్పటికీ ఎక్కడో సరైన డేటా మిస్ అవుతుందని చాలామంది నిపుణులు అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఫలితాలను బయటకు చెప్పలేమంటూ సంస్థ సమర్థించుకుంది. ఒకవేళ అప్పుడే చెప్పి ఉంటే షేర్ విలువపై అది ప్రభావం చూపేదని వెల్లడించింది. ప్రస్తుతం వచ్చిన ఫలితాలు తొలిదశ ప్రయోగానికి సంబంధించినవే అని చెప్పిన పరిశోధకులు తక్కువ, మీడియం, మరియు అధిక మోతాదు డోసులను తయారు చేసి వైరస్‌ను తట్టుకునే నిరోధక శక్తిని సృష్టించాలనే యోచనతోనే రూపొందించినట్లు చెప్పారు. ఇక ఈ ప్రయోగంలో పాల్గొన్న 45 మంది 18 ఏళ్ల నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్నవారే అని చెప్పారు. 28 రోజుల వ్యవధిలో రెండు వ్యాక్సినేషన్లు చేసినట్లు చెప్పారు. ఇక వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అందరిలోనూ వ్యాధినిరోధక శక్తి పెరిగినట్లు అబ్జర్వ్ చేసినట్లు పరిశోధకులు చెప్పారు.

  Bubonic Plague : అమెరికాలో ఉడుతకు Bubonic Plague పాజిటివ్‌! || Oneindia Telugu

  English summary
  An experimental coronavirus vaccine made by the biotech company Moderna provoked a promising immune response against the virus and appeared safe in the first 45 people who received it, researchers reported on Tuesday
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more