వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 ఏళ్ల తరువాత మొదటి సారి చోరీ జరిగింది

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచ దేశాలలో నిత్యం చోరీల కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతుంటాయి. ఇక భారతదేశంలో చోరీ కేసుల నమోదు సంఖ్య లెక్కకుమించిపోతుంటాయి. అయితే యూకేలోని స్కాట్లాండ్ తీరంలోని ఒక ద్వీపంలో 50 సంవత్సరాల తరువాత ఒక చోరీ కేసు నమోదు అయ్యింది.

విషయం తెలుసుకున్న స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం మీ ద్వీపంలో చోరీ జరిగిందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. స్కాట్లాండ్ తీరాన హీబ్రిడీయన్ అనే ద్వీపం ఉంది. ఇక్కడ జనాభా చాల తక్కువ ఉంటుంది.

ఈ ద్వీపంలో 1960 లో చెక్కతో తయారు చేసిన చిన్న ప్లేటు చోరీ అయ్యిందని ఒక కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసును ఇప్పటి వరకు ఛేదించలేని పోలీసులు దొంగను పట్టుకొలేకపోయారు. అప్పటి నుండి ఈ ద్వీపంలో నేరాలు జరిగినట్లు ఎలాంటి కేసులు నమోదు కాలేదు.

first island robbery in 50 years in UK

అందు వలన ఈ ప్రాంతం వైపు పోలీసులు సైతం కన్నెత్తి చూడరు. ఈ ద్వీపంలో జనరల్ స్టోర్ ఉంది. స్థానికులు, కస్టమర్ల సౌకర్యం కోసం 24 గంటలు ఈ స్టోర్ తెరిచే ఉంటుంది. ఎవరికి ఏమి కావాలో అవి తీసుకుని నిజాయితీగా అక్కడ ఉన్న క్యాష్ బాక్స్ లో నగదు పెట్టి వెళుతుంటారు.

అయితే ఇటివల రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు 200 పౌండ్ ల విలువైన బ్యాటరీలు, బిస్కెట్లు, చాక్లెట్లు చోరీ చేసి వెళ్లారని జనరల్ స్టోర్ నిర్వహకురాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ బిల్ క్లర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది.

English summary
The esoteric haul, which included biscuits, batteries and toiletries but not money, was taken overnight from the only shop on the island, which is owned by the National Trust for Scotland.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X