వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పామ్ బీచ్‌లో ఓటేసిన మెలానియా -మాస్కు లేకుండానే పోలింగ్ స్టేషన్‌కు -ఇదీ పోలింగ్ సరళి..

|
Google Oneindia TeluguNews

చూడబోతే ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ టర్నౌట్ రికార్టు స్థాయికి చేరేలా ఉంది. దేశంలో మొత్తం 23.92 కోట్ల మంది ఓటర్లకుగానూ ఇప్పటికే 10 కోట్ల మంది ముందస్తుగా ఓటేయగా.. మంగళవారం నాటి ఎలక్షన్ డే(పోలింగ్) సందర్భంగా ఓటర్లు పోటెత్తారు. 50 రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాల వద్ద తెల్లవారు జాము నుంచే సందడి నెలకొంది..

అమెరికా ఎన్నికల్లో అంతరాయం? -హోంల్యాండ్ సెక్యూరిటీ అప్రమత్తత -భద్రతకు భరోసాఅమెరికా ఎన్నికల్లో అంతరాయం? -హోంల్యాండ్ సెక్యూరిటీ అప్రమత్తత -భద్రతకు భరోసా

ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా, అంతకంటే ముందే పోలింగ్ కేంద్రాలకు జనం చేరుకోవడం కనిపించింది. గత ఎన్నికల టర్నౌట్ లో 50 శాతం ఇప్పటికే(ముందస్తు ఓటింగ్ తోనే) చేరగా, మంగళవారం నెలకొన్న జనసందోహాన్ని బట్టి కొత్త రికార్డు నెలకొనే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్ కేంద్రాలకు నేరుగా వెళ్లి ఓటేసినవారిలో..

First Lady Melania Trump votes in Palm Beach, Florida, but no facemask

అమెరికా ప్రధమ మహిళ, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్ మంగళవారం ఉదయం ఫ్లోరిడాలోని పామ్ బీచ్ కౌంటీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక ఓటరైన ఆమె.. అక్కడి బార్బరా మోడల్ రిక్రియేషన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి బ్యాలెట్ పై ఓటు గుద్దారు. న్యూయార్క్ ఓటరైన ప్రెసిడెంట్ ట్రంప్ ఇదివరకే ముందస్తుగా ఓటేసిన సంగతి తెలిసిందే. అయితే..

సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్సంచలనం: అమెరికా తొలి మహిళా ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ - నెలరోజుల్లోనే చూస్తారన్న ట్రంప్

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఓటర్లందరూ మాస్కు ధరించాలన్న ఫెడరల్ అధికారుల సూచనను ఫస్ట్ లేడీ మెలానియా పాటించకపోవడం గమనార్హం. మాస్కు లేకుండానే ఆమె ఓటేసి, ఫొటోలకు పోజులిచ్చారు. తన భర్త డొనాల్డ్ ట్రంప్ రెండో సారి విజయం సాధిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నంలోగా ఫలితాలపై క్లారిటీ వచ్చే అవకాశముంది.

First Lady Melania Trump votes in Palm Beach, Florida, but no facemask
English summary
US first lady Melania Trump has cast her vote during the 2020 presidential election at Morton and Barbara Mandel Recreation Center in Palm Beach, Florida. Melania was caught on video wearing a dress, sunglasses and heels, but no facemask. She has supported her husband during his campaign to be re-elected in the 2020 Election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X