వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిస్ యూనివర్స్ విజేత ప్రకటన: రగడ (వీడియో)

|
Google Oneindia TeluguNews

లాస్ వేగాస్: మిస్ యూనివర్స్ పోటీల విజేత ప్రకటన వివాదాస్పదమైంది. కొంత గందరగోళం జరిగి కార్యక్రమం నిర్వహకుడు స్టీవ్ హార్వే తొలుత విజేతల పేర్లు మార్చి దుమారం రేపాడు. క్షణాల్లో మళ్లీ విజేత పేరు మార్చి సింపుల్ గా సారీ చెప్పాడు.

అయితే ఇది కావాలనే చేశారని కొలంబియా ప్రజలు మండిపడుతున్నారు. ఎలాగైనా తమకు న్యాయం జరిగిందని ఫిలిప్పీన్స్ ప్రజలు అంటున్నారు. 2015 మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఫిలిప్పీన్స్ కు చెందిన పియా అలోంజ్ ఎగరేసుకు వెళ్లింది.

గత సంవత్సరం మిస్ యూనివర్స్ విజేత, కొలంబియా సుందరి పౌలినా వెగా పియా అలోంజ్ కు కిరీటం అలంకరించారు. అయితే కొలంబియాకు చెందిన అరియాడ్నా (రెండవ స్థానం) మాత్రం మొదట తను విజేత అని చెప్పి తరువాత మాట మార్చారని అసహనం వ్యక్తం చేస్తున్నది.

ఫైనల్స్ లో 79 మంది

ఫైనల్స్ లో 79 మంది

మిస్ యూనివర్స్ పోటీల్లో అనేక దేశాలకు చెందిన యువతులు పాల్గోన్నారు. ఫైనల్ కు 79 మంది చేరుకున్నారు.

టాప్ 15 లోనూ భారత్ కు నో చాన్స్

టాప్ 15 లోనూ భారత్ కు నో చాన్స్

భారత్ తరపున పోటీ పడిన ఊర్వశి టాప్ 15 లోనూ స్థానం సంపాధించుకోలేక పోయింది. భారత్ ప్రజలు తీవ్ర నిరాశకు గురైనారు.

వన్ టూ త్రీ

వన్ టూ త్రీ

ఫిలిప్పీన్స్ కు చెందిన పియా అలోంజ్ మిస్ యూనివర్స్ విజేత. రెండవ స్థానంలో కొలంబియాకు చెందిన అరియాడ్నా గ్విటెర్డ్, మూడో స్థానంలో అమెరికాకు చెందిన ఒలివియా జోర్డాన్ నిలిచారు.

అనందం ఆవిరి అయ్యింది

అనందం ఆవిరి అయ్యింది

మిస్ యూనివర్స్ విజేత అంటూ నిర్వహకులు ప్రకటించడంతో అరియాడ్నా గ్విటెర్డ్ ఆనందం. అంతలోనే ఆ ఆనందం ఆవిరి అయ్యింది.

మిస్ యూనివర్స్

మిస్ యూనివర్స్

రెండవ సారి నిర్వహకులు ప్రకటించిన ఫిలిప్పీన్స్ కు చెందిన మిస్ యూనివర్స్ పియా అలోంజో. చివరికి ఈమె మిస్ యూనివర్స్ అయ్యింది.

ఓదార్చిన సాటి యువతులు

ఓదార్చిన సాటి యువతులు

మిస్ యూనివర్స్ కిరీటం వెనక్కి తీసుకోవడంతో కొలంబియాకు చెందిన అరియాడ్నా గ్విటెర్డ్ స్టేజ్ మీదనే కన్నీరుమున్నీరు అయ్యింది.

మిస్ యూనివర్స్ వేడుకలు (వీడియో)

మిస్ యూనివర్స్ పోటీల సందర్బంగా మిస్ యూనివర్స్ విజేత ప్రకటన ఇలా జరిగింది. కిరీటం ఇలా పెట్టి అలానే వెనక్కి తీసుకున్నారు.

వివాదాస్పదం అయ్యింది

వివాదాస్పదం అయ్యింది

మిస్ యూనివర్స్ విజేత ప్రకటన వివాదాస్పదం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహకులపై మండిపడుతున్నారు.

అంతా జరిగిపోయింది, సింపుల్ గా సారి

జరిగిందంతా జరిగిపోయిన తరువాత మిస్ యూనివర్స్ నిర్వహకుడు స్టీవ్ హార్వే బహిరంగంగా క్షమాపణ చెప్పాడు. అయితే ఈయన గారి తీరుపై పలుదేశాల యువతులు విమర్శలు గుప్పిస్తున్నారు.

English summary
The host of the Miss Universe has apologised after mistakenly naming the wrong woman as winner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X