వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేప విలువ రూ. 23 కోట్లు...!

|
Google Oneindia TeluguNews

చేపలు పట్టడడం అనేది ఆయా దేశాల్లో చాలమందికి జీవనోపాధి... కాని కొద్దిమందికి మాత్రం హాబీగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో ఈ చేపలు పట్టే హబీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటీ హాబీతోనే ఐర్లాండ్‌ తీరంలో చేపడుతున్నా ఓ వ్యక్తికి అదృష్టం నీళ్లపైన తన్నుకువచ్చింది...కాని కష్టపడకుండా వచ్చిన అదృష్టాన్ని వద్దనుకుని నీళ్లలోనే వదిలేశాడు. ఇలా ఒకటికాదు రెండు ఏకంగా భారతీయ కరెన్సీలో 23 కోట్ల రుపాయాల విలువైన చాపను నీటిపాలు చేశాడు.

ఐర్లాండ్‌లోని సముద్రతీరంలో చేపల్ని పట్టుకుని వదిలేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం కొద్ది రోజుల నుండి కొనసాగుతోంది. ఇలా 15 బోట్లతో ఆక్టోబరు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో భాగంగానే చేపలు పడుతున్న ఐర్లాండ్‌లోని వెస్ట్‌కార్క్‌కు చెం దిన డేవ్‌ ఎడ్వర్డ్స్‌ అనే వ్యక్తికి సముద్రంలో ఒక భారీ ట్యూనా చేప చిక్కింది. ఈ ఏడాది ఐర్లాండ్‌లో వలకు చిక్కిన అతి పెద్ద ట్యూనా చేప ఇదే కావడం విశేషం. ఎనిమిదిన్నర అడుగులు ఉండే చేప 270 కిలోల బరువు ఉంది. దీంతో దీని బహిరంగ మార్కెట్ విలువ మూడు మిలియన్ యూరోలు ఉంటుందని స్థానిక మీడియా కథనాల్లో పేర్కోన్నారు. అంటే చేప విలువ భారతీయ కరెన్సీలో అక్షరాల 23 కోట్ల రుపాయాలు ఉంటుందన్నమాట

 Fish Worth 23 Crore Rupees,Caught and Released It Back Into the Sea

సాధరణంగా డేవ్‌ ఎడ్వర్డ్స్‌ బృందం చేపలు పట్టి వాటిని తిరిగి సముద్రంలో వేసేందుకు ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఎలాంటీ భారీ చేపలు ఉన్నాయనే అంచన వేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో పట్టిన చేపకు ఓ ట్యాగ్ కట్టి తిరిగి సముద్రంలోనే వదిలిపెట్టారు. ఆనంతరం చేపను నీటిలోకి వదులుతున్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. దీంతో డేవ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అంతపెద్ద విలువైన చాపను నీటిలో తిరిగి వదిలివేయడంపై నెటిజన్లు అశ్చర్యం వ్యక్తం చేశారు.

English summary
Man Who Caught a Fish Worth 23 Crore Rupees, Released It Back Into the Sea,The tuna was caught by Dave Edwards from West Cork
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X