వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గత ఇరవై ఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను వదిలింది..!చైనా పై తీవ్రస్తాయిలో మండిపడ్డ ట్రంప్..!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్/హైదరాబాద్ : చైనా దేశంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈ సారి డోస్ పెంచి కనికరంలేని పచ్చి ఆరోపణలు చేసారు అగ్రరాజ్యం అద్యక్షుడు. కరోనా వైరస్ వల్ల వస్తున్న ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న చైనా, తాజాగా ట్రంప్ చేసిన వాఖ్యలతో ఖంగుతిన్నంత పనయ్యింది. ట్రంప్ తాజా వ్యాఖ్యల పట్ల సభ్య దేశాలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

Recommended Video

Donald Trump Could 'Cut Off' China Ties & Says Doesn't Want To Speak To Xi Jinping

ప్రపంచ దేశాలకు కరోనా వైరస్ ను పరిచయం చేసిన చైనా గడిచిన ఇరవైఏళ్లలో ఐదు ప్రాణాంతాక వైరస్ లను ప్రపంచ మీద ప్రయోగించిందని, ఇక ఎలాగైనా చైనా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీంతో ప్రపంచ దేశాలు అసలు చైనా, అమెరికా మద్య ఏంజరుగతుందని ఆసక్తికరంగా గమనిస్తున్నట్టు తెలుస్తోంది.

Five deadly viruses left in last twenty years.!Trump furious over China

చైనా దేశపు నిర్వాకం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు సర్వనాశనం కావడంతో పాటు లక్షలమంది ప్రాణాలు పోయారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియాన్‌ ఘాటుగా విమర్శించారు. కొవిడ్-19 వైరస్ చైనా దేశంలోని వుహాన్‌ నుంచే వచ్చిందనడానికి నిర్ధిష్టమైన ఆధారాలున్నాయన్నారు. చైనా దేశం రకరకాల వ్యాధులను ప్రపంచం మీద ప్రయోగిస్తుంటే ప్రజలు సహించే పరిస్థితులు లేవని హెచ్చరించారు.

20 సంవత్సరాల వ్యవధిలో సార్స్‌, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ, జికా వైరస్ తో పాటు తాజాగా కొవిడ్-19 వంటి ఐదు అంటువ్యాధులు చైనా ప్రపంచానికి అంటించిందని మండిపడ్డారు. అది ఎంతో బాధ్యతారాహిత్యమని రాబర్ట్ ధ్వజమెత్తారు. అందుకే చైనాను కట్టడి చేసేందుకు అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. అమెరికన్ కాంగ్రెస్‌లో ఇందుకు సంబంధించి కీలక బిల్లు కూడా ప్రవేశ పెట్టింది. కరోనా వ్యాప్తికి సంబంధించిన వివరాలను అందించేందుకు చైనా దేశం సహకరించని పక్షంలో కఠిన ఆంక్షలు విధించేదిశగా అడుగులేస్తోంది ట్రంప్ ప్రభుత్వం.

English summary
China has introduced five deadly viruses to the world over the past twenty years, introducing the corona virus to the world. US President Donald Trump has made sensational remarks that should prevent any further Chinese aggression.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X