వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఏఏకు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్‌లో 5 తీర్మానాలు..

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ యూరోపియన్ పార్లమెంట్ ఐదు తీర్మానాలు ప్రవేశపెట్టబోతోంది. జనవరి 29న మూడు, జనవరి 30వ తేదీన రెండు తీర్మానాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. రెండు తీర్మానాలో సీఏఏ భయంకరమైన విభజన అని పేర్కొన్నారు. దీంతో ప్రపంచంలో అతిపెద్ద సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని భావిస్తోంది.

గణతంత్ర దినోత్సవాన్నీ వదల్లేదు: పౌరసత్వ నిరసన నినాదాల హోరు.. !గణతంత్ర దినోత్సవాన్నీ వదల్లేదు: పౌరసత్వ నిరసన నినాదాల హోరు.. !

తీర్మానంపై చర్చ

తీర్మానంపై చర్చ

యూరొపియన్ పార్లమెంట్‌లో తీర్మానంపై చర్చ జరిపుతారు. ఎంఈఎఫ్‌కు చెందిన 66 మంది సభ్యులు మాత్రం సీఏఏకు అనుకూలంగా మరో తీర్మానం చేసే అవకాశం ఉంది. కానీ సీఏఏ ఆందోళనలు చేసిన వారిపై ప్రభుత్వ చర్యను తప్పుబట్టే అవకాశం ఉంది. ఈ నెల 29న మూడు, 30వ తేదీన ఒక తీర్మానం ప్రవేశపెట్టి చర్చిస్తారు.

జోక్యం సరికాదు

జోక్యం సరికాదు

యూరొపియన్ పార్లమెంట్‌లో సీఏఏపై తీర్మానం ప్రవేశపెట్టడంపై ఇండియా స్పందించింది. పౌరసత్వ సవరణ చట్టం అనేది.. భారతదేశ అంతర్గత అంశం అని పేర్కొన్నది. ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్య దేశం చేసిన చట్టాలపై మరో దేశం తీర్మానం చేయడం సరికాదని అభిప్రాయపడింది.

పక్షపాతమే..?

పక్షపాతమే..?

యూరొపియన్ పార్లమెంట్‌లో సెంటర్ రైట్ యూరొపియన్ పీపుల్స పార్టీ ఒక తీర్మానం ప్రవేశపెట్టింది. పార్లమెంట్‌లో పార్టీకి 182 మంది ఎంపీలు ఉన్నారు. ముస్లింలను ఉద్దేశించి మాత్రం చట్టం చేశారని ఆరోపించింది.

పర్యటన నేపథ్యంలో

పర్యటన నేపథ్యంలో

మార్చి 13వ తేదీన ఇండియా-ఈయూ సమ్మిట్ ఉంది. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. రెండు నెలల ముందు యూరొపియన్ పార్లమెంట్‌లో సీఏఏపై తీర్మానాలు ప్రవేశపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా కూడా ధీటుగా తిప్పికొట్టింది. ఒకదేశం చేసిన చట్టంపై మరో దేశం కల్పించుకోవడం సరికాదని హితవు పలికింది.

English summary
Five resolutions in European Parliament slam CAA
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X