వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని ఇరాన్: బాగ్దాద్‌పై రాకెట్లు.. అమెరికా రాయబార కార్యాలయమే లక్ష్యంగా: క్యాంటీన్‌పై.. !

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్: అమెరికా నిర్వహించిన వైమానిక దాడుల్లో తమ సైన్యాధ్యక్షుడు ఖాసిం సోలేమనిని కోల్పోయినప్పటి నుంచీ ఇరాన్.. ప్రతీకారంతో రగిలిపోతూ వస్తోంది. అమెరికాపై కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో హైసెక్యూరిటీ జోన్‌లో కొనసాగుతోన్న అమెరికా రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని తరచూ రాకెట్లను ప్రయోగిస్తోంది. కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయనుకుంటున్న ఈ వైమానిక దాడులు.. మళ్లీ తీవ్రం అయ్యాయి.

హైసెక్యూరిటీ జోన్‌లో యూఎస్ ఎంబసీ..

హైసెక్యూరిటీ జోన్‌లో యూఎస్ ఎంబసీ..

అమెరికా రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని మరోసారి అయిదు రాకెట్లను వెంటవెంటనే ప్రయోగించింది ఇరాన్. రెండు రాకెట్లు గురి తప్పగా.. మూడు రాయబార కార్యాలయాలం పరిసరాల్లో పడ్డాయి. ఇందులో ఒక రాకెట్ రాయబార కార్యాలయం కేఫ్టేరియాను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడినట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు. ఇరాక్ కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం ఈ దాడులు చోటు చేసుకున్నాయి.

క్యాంటీన్ ధ్వంసం..

క్యాంటీన్ ధ్వంసం..


ఇరాక్‌లోని సైనిక ప్రభుత్వం ఈ దాడులను ధృవీకరించింది. తమదేశంలోని అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్ దాడులు చోటు చేసుకున్నాయని సైనిక ప్రభుత్వ ప్రధానమంత్రి అదిల్ అబ్దుల్ మెహ్దీ నిర్ధారించారు. ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనలో రాయబార కార్యాలయం క్యాంటీన్ ధ్వంసమైనట్లు ఇరాక్ విదేశాంగ మంత్రి జెబారి వెల్లడించారు. ఈ దాడుల వెనుక ఇరాన్ ప్రభుత్వం హస్తం ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు.

కవ్వింపు చర్యలకు దిగుతున్నారంంటోన్న అమెరికా..

కవ్వింపు చర్యలకు దిగుతున్నారంంటోన్న అమెరికా..

పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ (పీఎంఎఫ్)కు అండగా ఉంటూ ఇరాన్.. తరచూ ఈ దాడులను పూనుకుంటున్నట్లు తాము భావిస్తున్నామని అన్నారు. ఈ నెల 9వ తేదీన అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలా రాకెట్లను ప్రయోగించడం ఇది రెండుసారి. దీనితో- ఈ దాడులను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతిదాడులకు దిగే ఉద్దేశం తమకు లేనప్పటికీ.. అలాంటి అవకాశాన్ని కల్పించేలా ఈ దాడులు కొనసాగుతున్నాయని అమెరికా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

రాయబార కార్యాలయమే లక్ష్యంగా.. రాకెట్లు..

రాయబార కార్యాలయమే లక్ష్యంగా.. రాకెట్లు..

బాగ్దాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దాడల సందర్భంగా ఇరాన్ సైన్యాధ్యక్షుడు ఖాసి సులేమని మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఇరాన్ ప్రభుత్వం.. తరచూ అమెరికా రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని రాకెట్లను సంధిస్తూ వస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు, ఎయిర్‌బేస్‌పైనా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 80 మరణించినట్లు అప్పట్లో ఇరాన్ చెప్పుకొంది.

English summary
One of the rockets hit an embassy cafeteria at dinner time, a security source told, while two others landed nearby. The US embassy did not respond to requests for comment and it was not immediately clear whether the injured person was an American national or an Iraqi staff member working at the mission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X