వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: చైనా..దేనికైనా సై! జలమార్గంలో అయిదంతస్తుల భవనం తరలింపు!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: అనుకోవడంలో ఆలస్యం. ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు, తెలివి తేటలు చైనాకు ఉన్నాయి. దీనికి నిదర్శనంగా చెప్పుకోవడానికి ఇప్పటికే చాలా ఉన్నాయి. కృత్రిమ చంద్రుడిని తయారు చేయడానికి సన్నాహాలు చేస్తుండటం, ప్రపంచంలోనే అతి పెద్ద రిజర్వాయర్ ను కట్టడం.. ఇవన్నీ చైనాకే సాధ్యం. అలాంటిది- మరో ఘనతను సాధించింది.

వైఎస్ జగన్ జెరూసలేం పర్యటన ఖర్చు ఎంతో తెలుసా? ఎంత వ్యక్తిగత టూరే అయినా..!వైఎస్ జగన్ జెరూసలేం పర్యటన ఖర్చు ఎంతో తెలుసా? ఎంత వ్యక్తిగత టూరే అయినా..!

అయిదంతస్తుల ఓ భవనాన్ని నదీ మార్గంలో తరలించాలనే ఆలోచన రావడమే గొప్ప విషయం అనుకుంటే.. అనుకున్నదే తడవుగా దాన్ని ఆచరణలో పెట్టింది. అమలు చేసి నిరూపించింది. ఓ అయిదంతస్తుల హోటల్ ను స్థాన చలనం చేయాల్సి రావడంతో.. దాన్ని జలమార్గంలో తరలించింది. అంత పెద్ద భవనం.. ఓ పడవలా తరలి వెళ్లడాన్ని అద్భుతంగా తిలకించారు స్థానికులు.

Five-storey building caught floating across China river in viral video

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. నదిలో తరలిస్తోన్న ఆ భవనం ఓ ఫ్లోటింగ్ రెస్టారెంట్. యాంగ్ట్ఝై నదిలో దీన్ని నిర్మించారు. ఒకే చోట స్థిరంగా ఉండేలా దీన్ని నిర్మించారు. అనంతరం అక్కడి విధానపరమైన నిర్ణయాల్లో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో ఆ రెస్టారెంట్ భవనాన్ని వేరే చోటికి తరలించాల్సి వచ్చింది నిర్వాహకులకు. దాన్ని ఇలా నదిలో తీసుకెళ్లారు. నిజానికి ఈ తరలింపు అనేది గత ఏడాది నవంబర్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ఎనిమిది నెలల తరువాత అంటే- గురువారం సోషల్ మీడియాలో విడుదల చేశారు. మాస్సిమో పేరు మీద ఓ ట్విట్టర్ యూజర్ దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు, ట్విట్టరెట్టీలు ఆశ్చర్యపోతున్నారు. దీన్ని గ్రాఫిక్ గా అభివర్ణించిన వారూ లేకపోలేదు.

English summary
video of a 5-storey building cruising in the Yangtze river in China has gone viral and it is nothing like we have ever seen before.The now-viral video that was originally shot in November 2018, was recently tweeted again by a Twitter user, Massimo with the caption, "Things that happen in China. A five-story 'building' was spotted cruising along the Yangtze River back in November 2018. The 'building' was actually a floating restaurant. Authorities said the restaurant needed to relocate due to policies changes."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X