వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదేళ్ళ క్రితం.. సరిగ్గా ఇదే రోజు.. అమెరికా ఎటాక్..

|
Google Oneindia TeluguNews

వెయ్యి గొడ్లను తిన్న రాబందైనా ఒక్క గాలివానకు బలికావాల్సిందే అన్నట్టు.. ఉగ్రవాదంతో ఎన్ని దేశాలను వణికించిన వ్యక్తి అయినా సరే ఒక గట్టి ప్రతిఘటనకు బలికావాల్సిందే. అమెరికాలో నరమేథం సృష్టించి.. చివరకు అదే అమెరికా చేతిలో దిక్కులేని చావు చచ్చిన ఒసామా బిన్ లాడెన్ జీవితం ఇందుకో ఉదాహరణ. ఐదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు మే 2వ తేదీన అమెరికన్ సేనల చేతిలో హతమయ్యాడు లాడెన్.

ప్రపంచ దేశాలకు పెద్దన్న లాంటి అమెరికా ఒకసారి టార్గెట్ చేసిందంటే.. పని పూర్తయ్యేదాకా పట్టువీడదు. ఇందుకు ఆయా దేశాల నుంచి సహకారం ఉన్నా..! లేకున్నా..! చట్ట పరిధిలోని నియమాలేవైనా అడ్డొచ్చినా..! అవన్నీ అమెరికా దూకుడు ముందు బేఖాతరే. లాడెన్ కోసం పాకిస్తాన్ ని జల్లెడ పట్టిన అమెరికా పాక్ కి ఏ మాత్రం అనుమానం రాకుండా లాడెన్ కోసం ఆపరేషన్ మొదలుపెట్టింది.

 five years ago america attacked bin laden

చట్టాల ప్రకారం నడుచుకుంటే లాడెన్ ను శిక్షంచడం జరిగే పని కాదని తేల్చుకున్న అమెరికా.. లాడెన్ ను అంతం చేయడమే ధ్యేయంగా పావులు కదిపింది. చివరికి పాక్ లోని అబోటాబాద్ లో లాడెన్ ఉన్నట్టు గుర్తించిన అమెరికా, షూటింగ్ లో ఆరితేరిన మెరికల్లాంటి నేవీ సీల్స్ సైన్యంతో అర్థరాత్రి సమయంలో లాడెన్ ఉన్న భవనంలోకి చొరబడింది.

40 నిమిషాల పాటు జరిగిన ఆపరేషన్ లో లాడెన్, లాడెన్ కొడుకుతో సహా మరో ముగ్గురు ఉగ్రవాదులను హతం చేసింది అమెరికా. ఈ చర్యతో 2001 సెప్టెంబరు 11 వ తేదీన తమ దేశంపై లాడెన్ సృష్టించిన భీభత్సానికి ప్రతీకారం తీర్చుకుంది అమెరికా. ఈ మొత్తం వ్యవహారాన్ని అమెరికా అధ్యక్షుడు ఒబామా లైవ్ లో వీక్షంచడం గమనార్హం.

English summary
exactly five years ago america done an operation to attack the terrorist osama bin laden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X