• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సూర్యుడు వస్తే చాలు.. ఆ హోటల్లో చికెన్ కర్రీ రెడీ అయినట్టే! (వీడియో)

By Ramesh Babu
|

బ్యాంకాక్: సూర్యరశ్మి వల్ల మనకు ఉపయోగాలేమిటి? పగటిపూట వెలుతురు, శరీరానికి డి-విటమిన్‌, సౌర విద్యుత్తు, ఎండలో బట్టలు.. వడియాలు ఆరబెట్టుకోవచ్చు. కానీ.. ఎండతో వంట చేసుకోవచ్చా!?

వేసవికాలంలో ఎండలు మండుతున్నప్పుడు అపుడప్పుడు రోడ్డుపై కోడిగుడ్లు పగలగొట్టి ఆమ్లెట్‌ వేసి ఎండ తీవ్రత ఎలా ఉందో సరదాగా చూపిస్తుంటారు. కానీ.. నిజంగానే ఓ వ్యక్తి కేవలం ఎండ సాయంతో చికెన్‌ను కాల్చుతూ నోరూరించే వంటకం తయారు చేస్తున్నాడు.

థాయిలాండ్‌లోని ఫెట్చబురి పట్టణానికి చెందిన సిలా సుథారత్‌(60) అనే వ్యక్తి స్థానికంగా చిన్న హోటల్‌ నిర్వహిస్తున్నాడు. 20 ఏళ్లుగా సిలా సూర్యకాంతిని వినియోగిస్తూ చికెన్‌ను కాల్చుతూ అందర్ని ఆకర్షిస్తున్నాడు.

మొదట్లో అతను చికెన్‌ను బొగ్గుల మంటపై కాల్చేవాడు. 1997లో ఒకసారి రోడ్డుపై నుంచి వెళ్తున్న బస్‌ అద్దాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెంది సిలాపై పడిందట. అది చాలా వేడిగా ఉండటం గమనించిన సిలా ఎండతోనే వంట చేయాలని నిర్ణయించుకున్నాడు.

దీనికోసం వెయ్యి చిన్న చిన్న అద్దాలతో ఒక తెరను నిర్మించాడు. దాన్ని సూర్యుడికి అభిముఖంగా పెట్టడంతో సూర్యకాంతి ఆ అద్దాలపై పడి పరావర్తనం చెంది అధిక ఉష్ణోగ్రతతో కాంతులను మళ్లిస్తుంది. ఆ కాంతుల్ని సిలా చికెన్‌ కాల్చడానికి వినియోగిస్తున్నాడు.

మొదట సిలా చేసిన ప్రయత్నాలు చూసి అందరూ నవ్వుకున్నారు. ఎండతో వంట చేయడం అసాధ్యమన్నారు. కానీ.. తను రూపొందించిన తెరతో కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో 1.5 కేజీల చికెన్‌ తయారు అవుతుండటం చూసి నవ్వుకున్నవాళ్లే ఆశ్చర్యపోయారు.

సిలా ఏర్పాటు చేసిన అద్దాల తెర ద్వారా వచ్చే ఎండ 312 డిగ్రీలు ఉంటుందట. ఇలా ఎండతో చేసిన చికెన్‌ రుచి చూడటానికి అనేక మంది సిలా హోటల్‌ ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఆయన వ్యాపారం బాగా సాగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Not many chefs don a welding mask before they enter the kitchen, but Sila Sutharat prefers to cook his chicken sunny side up. Two hours south of Bangkok this 60-year-old roadside vendor has found an ingenious way to offer his customers something a little different by harnessing the power of the sun. Using a large wall of nearly 1,000 moveable mirrors a device he designed and built himself he focuses the sun's rays onto a row of marinated chickens, sizzling away under the intense heat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more