వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

|
Google Oneindia TeluguNews

దుబాయ్ : సాధారణంగా మతిమరపు ఉంటుంది. కొందిరికీ కొంచెం అయితే .. మరికొందరికీ అది ఎక్కువగా ఉంటుంది. జీవనశైలి, పని ఒత్తిడి వల్ల కూడా త్వరగా మరిచిపోతున్నాం. కానీ సౌదీ అరేబియాలో విచిత్ర ఘటన జరిగింది. ఓ మహిళ తన పాపను మరిచిపోయి .. విమానం ఎక్కింది. ప్లైట్ టేక్ ఆఫ్ కూడా అయ్యింది. ఆ తర్వాత తెరుకున్న ఆమె .. పరుగెత్తుకుంటూ విమాన సిబ్బంది వద్దకెళ్లింది. ఎయిర్ పోర్టు బోర్డింగ్ లాంజ్ లో పాపను మరచిపోయానని .. చెప్పడంతో విమానాన్ని వెనక్కి మళ్లీంచారు ఫైలట్.

<strong>తూచ్ ..నేనెళ్లట్లెదు .. పార్టీ మార్పుపై చేవెళ్ల చెల్లెమ్మ</strong>తూచ్ ..నేనెళ్లట్లెదు .. పార్టీ మార్పుపై చేవెళ్ల చెల్లెమ్మ

విచిత్ర ఘటన ..

విచిత్ర ఘటన ..

వాతావరణం, సిగ్నల్స్ .. అన్నీ పరిశీలించుకొని గాల్లోకి ఎగిరిన విమానం తిరిగి ల్యాండ్ కావడం అరుదు. అత్యవసర సమాయాల్లో మళ్లీస్తారు. కానీ సౌదీ అరేబియాలో మాత్ర విచిత్ర ఘటన జరిగింది. బోర్డింగ్ లాంజ్ లో తన పాపను మహిళ మరచిపోవడంతో పైలట్ తిరిగి విమానాన్ని జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ వీడియోలో వైరలైంది.

ఏటీసీతో ఫైలట్ సంభాషణ ..

ఏటీసీతో ఫైలట్ సంభాషణ ..

మహిళ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న పైలట్ మళ్లీ విమానాన్ని దింపేందుకు ఏటీసీతో సంప్రదింపులు జరిపారు. ఏం జరిగింది ? ఎందుకు విమానం ల్యాండ్ చేస్తారని ఏటీసీ అధికారులు అడుగగా .. ఎయిర్ పోర్టు వెయిటింగ్ లాంజ్ లో ఓ మహిళ తన పాప మరచిపోయిందని తెలిపారు.

నిజమా ? ఆ అవును ..?

నిజమా ? ఆ అవును ..?

ఈ విషయం చెప్పడంతో ఏటీసీ అధికారులు విశ్వసించలేదు. మరోసారి కన్ఫామ్ చేయండి .. పాపను మరచిపోయినందుకే ఎయిర్ పోర్టులో తిరిగి ల్యాండ్ చేస్తారా మరే కారణం ఉందా ? అని ప్రశ్నించారు. దీనికి పైలట్ అదే నిజమని, మరే కారణం లేదని చెప్పారు. మీరు అనుమతిస్తే విమానం ల్యాండ్ చేస్తామని .. లేదంటే తిరిగి వెళ్లిపోతామని చెప్పడంతో చివరకి పర్మిషన్ ఇవ్వడంతో విమానం ల్యాండైంది.

English summary
Flights are cleared to return to airports when there is a major emergency and something happens to force the pilot to turn around. But to return because a mother on the flight forgot her baby on the ground is strange. The bizarre incident happened over the weekend when a Saudia plane returned to the airport after taking off as a passenger on board had forgotten her baby at the airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X