వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్దలైన అగ్నిపర్వతం: విమానాలు బంద్

|
Google Oneindia TeluguNews

జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైంది. ఈ దెబ్బతో పలు ఎయిర్ పోర్టులను మూసివేశారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు నానా ఇబ్బంది పడ్డారు. అయితే శుక్రవారం రాత్రి పరిస్థతి అదుపులోకి వస్తుందని ఎయిర్ లైన్స్ అధికారులు అంటున్నారు.

శుక్రవారం ఇండోనేషియాలోని తూర్పూ జావాలో అగ్ని పర్వతం బద్దలైంది. విషయం గుర్తించిన ఇండోనేషియా ఎయిర్ లైన్స్ అధికారులు లంబాక్, బాలి, జంబర్, బన్ యూవాంగి ఎయిర్ పోర్టులను మూసివేస్తున్నామని ప్రకటించారు.

 Australia

ప్రయాణికులకు వీలుగా ఇదే విషయం ట్విట్ చేశారు. అప్పటికే ఎయిర్ పోర్టులు చేరుకున్న ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. వెనక్కి తిరిగి వెళ్లలేక ఎయిర్ పోర్టులోనే మకాం వేశారు. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నామని ఎయిర్ లైన్స్ అధికారులు ప్రకటించారు.

తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీుసుకుంటామని అధికారులు తెలిపారు. అగ్ని పర్వతం బద్దలు కావడంతో విపరీతమైన బూడిద ఆకాశాన్ని తాకింది. అందు వలన ఈ నాలుగు ఎయిర్ పోర్టు ల నుండి సర్వీసులను రద్దు చేశారు. మిగిలిన ఎయిర్ పోర్టుల నుండి విమానా సర్వీసులు సంచరిస్తున్నాయని అధికారులు తెలిపారు.

English summary
Ash from Mount Ruang, which erupted last Thursday, has drifted towards Denpasar Airport, causing visibility issues.The volcano is about 150 kilometres from the airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X