• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కనురెప్పే కాటేసింది.. ఏడాది కూతురిపై లైంగికదాడి, ఆపై పోర్న్ సైట్‌లో అప్‌లోడ్, 70 ఏళ్ల జైలు

|

ప్లోరిడా : కనురెప్పే కాటేసింది. అవును మీరు విన్నది నిజమే.. లాలించి ఆడించాల్సిన చేతలు కీచకపర్వానికి తెరతీశాయి. అదీ కూడా ఏడాది వయస్సున కూతురిపై రేప్ చేశాడో కీచకుడు. అంతేకాదు తన పైశాచిక ఆనందాన్ని వీడియో తీసి శాడిజాన్ని ప్రదర్శించాడు. దాంతో సరిపెట్టలేదు .. దాని పోర్న్ సైట్‌లో పెట్టడంతో .. ఆ నీచుడిని పోలీసులు పట్టుకున్నారు. కటకటాల్లోకి వెళ్లి ఊచలు లెక్కిస్తున్నాడు.

ఆడించాల్సిన చేతులే ..

ఆడించాల్సిన చేతులే ..

నాన్న.. దైవం, పిల్లలకు మంచి, చెడు చెప్పి తీర్చిదిద్దే గురువు. కానీ మారుతున్న కాలంలో వావి వరసలు మాయమవుతున్నాయి. అండగా ఉండాల్సిన చేతులే కీచకపర్వానికి తెరతీస్తున్నాయి. పసిమొగ్గలపై లైంగికదాడి చేస్తూ సమాజాన్ని భ్రష్టు పటిస్తున్నారు. అమెరికాలోని ప్లోరిడాకు చెందిన జేమ్స్ లొకార్డ్ .. ప్యారా మెడికోగా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఏడాది కూతురు ఉంది. కానీ ఇతని నీచపు బుద్ధి క్రమంగా బయటపడింది. అతను చేసిన పాడుపనే అతనని ఊచలు లెక్కబెట్టిస్తోంది.

కూతురిపైనే ..

కూతురిపైనే ..

సరిగ్గా మూడేళ్ల క్రితం ఏడాది వయస్సున్న తన కూతురిపైనే లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో తీసి .. పోర్స్ వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేశాడు. ఇలా తన కీచక పర్వాన్ని రెండేళ్లు కొనసాగించాడు. ఇలా జరుగుతుండగా ఓసారి పోర్న్ సైట్లపై పోలీసులు నిఘా పెట్టారు. జేమ్స్ ఐపీ అడ్రస్ నుంచి వీడియోలు రావడంతో విచారణ ముమమరం చేశారు. గతేడాది అక్టోబర్ 5న అతని ఇంటిలో సోదాలు చేశారు. అతని కంప్యూటర్‌లో మరిన్ని పోర్న్ వీడియోలు, చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన ఫోటోలు లభించాయి. దీంతో అతనే వీడయోలు అప్ లోడ్ చేశాడని నిర్ధారించుకున్నారు.

 చేతులు గుర్తింపు ..

చేతులు గుర్తింపు ..

వీడియోలో జేమ్స్ ముఖం కనిపించనప్పటికీ.. ఆ వీడియో చూసిన జేమ్స్ భార్య అతని చేతులను గుర్తుపట్టింది. అవి జేమ్స్ చేతులేనని చెప్పింది. కన్న కూతురిపై భర్త దారుణానికి ఒడిగట్టారని తెలిసి రోదించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ జరిగింది. వాద, ప్రతివాదనలు ముగిసాయి. తాజాగా జేమ్స్‌ చేసిన నీచపు పనికి ఆ దేశం న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. జేమ్స్‌కు 70 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ .. కఠిన తీర్పును వెలువరించింది. దీంతో మరొకరు ఇలాంటి సాహసం చేయాలంటే భయపడే పరిస్ధితిని తన తీర్పులో ఇచ్చారు న్యాయమూర్తి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A former paramedic from Florida was sentenced to 70 years in prison for recording a series of heinous videos of himself raping his 1-year-old daughter and posting them to the dark web.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more