వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యాగ్ పోయిందంటూ పోలీసులకు ఫోన్: 'డ్రగ్స్' ఉన్నట్లు తేలడంతో కటకటాల్లోకి!

తన బ్యాగ్ పోయిందంటూ పోలీసులను ఆశ్రయించి వెతికిపెట్టమన్నాడు. అయితే ఆ బ్యాగులో కొకైన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించడంతో కటకటాలు తప్పలేదు.

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: కొకైన్, హెరాయిన్, గంజాయి.. తదితర మాదకద్రవ్యాల వాడకం చాలా దేశాల్లో నిషిద్దం. పోర్చుగల్ లాంటి కొన్ని దేశాల్లో తప్పితే చాలా చోట్ల వీటిని నిషేధించారు. కాబట్టి వీటి వినియోగం అసాంఘీక కార్యకలాపాల కిందకే వస్తుంది.

పోలీసుల కంటపడకుండా డ్రగ్స్ విక్రేతలుగా కొనసాగుతున్నవారు కూడా చాలామందే ఉంటారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా.. ఏమాత్రం లీక్ అవకుండా వీరు వ్యవహారం చక్కబెడుతుంటారు. కానీ ఫ్లోరిడాకు చెందిన డేవిడ్‌ అనే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా పోలీసులకే ఫోన్ చేసి మరీ ఇరుక్కుపోయాడు.

Florida drug dealer calls 911 to report missing cocaine

తన బ్యాగ్ పోయిందంటూ పోలీసులను ఆశ్రయించి వెతికిపెట్టమన్నాడు. అయితే ఆ బ్యాగులో కొకైన్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. డేవిడ్ కొంతకాలంగా డ్రగ్ డీలర్ గా వ్యవహరిస్తున్నట్లు వారు చెబుతున్నారు. సోమవారం ఉదయం కొకైన్ బ్యాగును వేరేచోటుకు అక్రమంగా తరలిస్తున్న క్రమంలో.. ఆ బ్యాగు అపహరణకు గురైంది. దీంతో పోలీసులను ఆశ్రయించి బ్యాగ్ తెచ్చివ్వాలని కోరాడు.

కానీ అతను డ్రగ్స్ సరఫరా ముఠాకు చెందినవాడని గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరపరచడంతో.. 4000 డాలర్ల పూచికత్తుపై బెయిల్‌ మంజూరైంది. అక్కడి పోలీసులు నిందితుడు డేవిడ్ ఫోటోను తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. ఇతగాడి నిర్వాకం తెలిసినవాళ్లంతా మరీ ఇంత అమాయకుడైతే ఎలా? అంటూ నవ్విపోతున్నారు.

English summary
Responding to a call about a burglary Sunday, police in Fort Walton Beach, Fla., discovered a very forthright man claiming to be a drug dealer in need of some assistance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X