• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కమలా.. నువ్వు చావబోతున్నావ్ -యూఎస్ ఉపాధ్యక్షురాలి హత్యకు పన్నాగం -ఫ్లోరిడా నర్సు అరెస్ట్

|

జోడుగుర్రాలైన జోబైడెన్-కమల హ్యారిస్ అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయింది. గద్దెనెక్కుతూనే 100 రోజుల ప్లాన్ ప్రకటించిన ఆ ఇద్దరూ నిర్దేశిత లక్ష్యాలను సాధించారనడానికి గుర్తుగా పలు సర్వేల్లో మెరుగైన అప్రూవల్స్ పొందారు. కొవిడ్ పై పోరాటంలో బిజీగా ఉన్న కమలకు అనూహ్య అనుభవం ఎదురైంది..

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేస్తానని బెదిరించిన ఫ్లోరిడాకు చెందిన 39 ఏళ్ల నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి దక్షిణాసియా, ఆఫ్రికన్ అమెరికన్‌గా కమల రికార్డులకు ఎక్కగా, ఆమెను చంపుతానని బెదిరించిన నర్సు కూడా నల్లజాతీయురాలే కావడం గమనార్హం.

గాలి ద్వారా కరోనా :ఆ మాస్కులు వద్దు -ఎన్‌95 లేదా కేఎన్‌95 మాస్క్‌లే రక్ష -అంటు వ్యాధుల నిపుణులు

కమలా హారిస్‌ను చంపుతానని, శారీరక దాడికి పాల్పడతానంటూ బెదిరించిన ఆ నర్సును ఫ్లోరిడాకు చెందిన నివియానె పెటిట్ ఫెల్ప్స్ అని, ఉద్దేశపూర్వకంగా పదేపదే బెదిరింపులకు పాల్పడిన ఆమెను యూఎస్ సీక్రెట్ సర్వీస్ అదుపులోకి తీసుకుని, విచారణ అనంతరం అరెస్ట్ చేసిందని అధికారిక ప్రకటన వెలువడింది.

Florida nurse arrested for threatening to kill US Vice President Kamala Harris

నిందితురాలైన నివియానె 2001 నుంచి జాక్సన్ హెల్త్ సిస్టమ్స్‌లో పనిచేస్తోంది. జైలులో ఉన్న తన భర్తకు ఫెల్ప్స్ జేపే (ఖైదీలతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులకు అనుమతించే కంప్యూటర్ అప్లికేషన్) ద్వారా పలు వీడియోలు పంపింది. అధ్యక్షుడు జో బైడెన్, కమలా హారిస్‌ తదితరులపై ద్వేషంతో ఊగిపోతుండడం ఆ వీడియోల్లో కనిపిస్తోంది. అంతేకాదు, కమలను చంపుతానని ఫెల్ప్స్ మరో వీడియోలో చెప్పుకొచ్చింది. ''కమలా హారిస్ నువ్వు చనిపోబోతున్నావు. నీ రోజులు దగ్గరపడ్డాయి'' అని ఇంకో వీడియోలో హెచ్చరించింది.

డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణికి భారీ షాక్ -ఎస్టీ హోదాపై హైకోర్టు నోటీసులు -రాజీనామా చేయాలంటూ

  Mia Khalifa మద్దతు రైతులకే.. తీవ్రంగా స్పందించిన భారత్ | Rihanna | Greta Thunberg

  ఫిబ్రవరి 18న పంపిన మరో వీడియోలో.. ''నేను తుపాకి రేంజ్‌లోకి వెళ్లబోతున్నా. దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా.. నువ్వు చనిపోబోతున్నావ్. రాసిపెట్టుకో. ఈ రోజుకు సరిగ్గా 50 రోజులు'' అని పేర్కొంది. దర్యాప్తు అధికారులు ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఓ ఫొటోలో ఫెల్ప్స్ షూటింగ్ రేంజ్‌లో తుపాకి పట్టుకుని నవ్వుతూ కనిపించింది. ఫిబ్రవరిలోనే ఆమె ఆయుధ లైసెన్స్ తీసుకుంది.

  English summary
  A39-year-old nurse in the US state of Florida has been arrested for allegedly threatening to kill Vice President Kamala Harris, according to media reports on Saturday. Niviane Petit Phelps was arrested following an investigation by the US Secret Service, CNN reported.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X