వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్‌లోకి దూసుకొచ్చిన దుండగుల కారు, హెలికాప్టర్‌లో చేధించి పట్టుకొన్న సిబ్బంది

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలోకి ఓ కారు దూసుకొచ్చింది. ఫ్లోరిడాలో గల పామ్ బీచ్‌ మార్ ఏ లాగో రిసార్ట్‌లోకి దుండగుల కారు వచ్చింది. ప్రధాన గేటులోకి కారు దూసుకురావడంతో అధికారులు అలర్టయ్యారు. కారు వచ్చిన సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడ లేరు. కానీ శుక్రవారం తర్వాత మాత్రం చేరుకోవాల్సి ఉంది. వెంటనే పామ్ బీచ్ కౌంట్ షెరీఫ్ పోలీసులు దుండగుల కారును వెంబడించారు. హెలికాప్టర్‌లో ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. వారిపై కాల్పులు జరిపామని, వారికి ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు.

అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11 గంటలకు రిసార్ట్ వద్ద దుండగుల కారు భదత్రను ఉల్లంఘించింది. బ్లాక్ కలర్ ఎస్‌యూవీని భద్రతా సిబ్బంది వెంబడించారు. హెలికాప్టర్‌తో ఛేజ్ చేసి మరీ కాల్పులు జరిపారు. ఇద్దరు దుండుగులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. దుండగులు ఎవరన్న అంశంపై అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవీ చేపట్టిన తర్వాత మార్ ఎ లాగోలో భద్రత ఉల్లంఘన ఘటనలు వరుసగా చొటుచేసుకుంటున్నాయి.

Florida: Shots fired at intruder vehicle at Trumps Mar-a-Lago resort

అమెరికా అధ్యక్షుడు వాషింగ్టన్‌లో గల అధికార నివాసం వైట్‌హౌస్‌లో ఉండాలి. కానీ ట్రంప్ శ్వేతసౌధంలో ఉంటే తాను ఫ్లోరిడా ప్రజలకు దూరమవుతున్నానని భావించి, తన సొంతింటికీ వచ్చేశారు. దాదాపు ఏడాది నుంచి ఇక్కడే ఉంటున్నారు. అధికార కార్యక్రమాల కోసం మాత్రం వాషింగ్టన్, న్యూయార్క్ పర్యటించి.. తిరిగి ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్ లేని సమయంలో వాహనం దూసుకురావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

English summary
authorities say officers fired shots at a vehicle that breached security Friday at President Donald Trump's Mar-a-Lago resort in Palm Beach, Florida
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X