వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్లాస్క్'లో వీర్యం!: పెళ్లి కాకుండా పిల్లల్ని కనాలని, పోలీసుల హెల్ప్!..

యువతి కోరిక మేరకు.. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. థర్మోప్లాస్క్ మూత తీసిచ్చారు. యువతి వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు సైతం హర్షం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

ఫ్లోరిడా: పెళ్లి కాకుండానే పిల్లల్ని కనాలనుకున్న ఓ యువతి.. ఇందుకోసం కృత్రిమ గర్భధారణ పద్ధతిని ఎంచుకుంది. విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వకుండా ఓ ఆసుపత్రి వైద్యులను సంప్రదించి తన కోరిక గురించి చెప్పింది. దీంతో వైద్యులు ఓ థర్మోస్ ప్లాస్క్ లో పురుషుడి వీర్యాన్ని ఇచ్చారు.

ఇక్కడిదాకా.. అంతా యువతి అనుకున్నట్లే జరిగిపోయినా.. ఇక్కడే అసలు కథ మొదలైంది. ఇంటికెళ్లిన తర్వాత దాని మూత తీయడానికి యువతి బెంబేలెత్తిపోయింది. మూత తీస్తే థర్మోప్లాస్క్ ఎక్కడ పేలుతుందేమోనన్న భయం పట్టుకుంది. దీంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించి తనకు సహాయం చేయాల్సిందిగా కోరింది. తన వివరాలను గోప్యంగా ఉంచాల్సిందిగా కోరింది.

Florida woman calls police concerned semen stored in thermos might explode

యువతి కోరిక మేరకు.. ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు.. థర్మోప్లాస్క్ మూత తీసిచ్చారు. యువతి వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఫేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన పోలీసులు.. యువతి వివరాలను కూడా వెల్లడించడం గమనార్హం. పోలీసులు చెప్పిన వివరాలను బట్టి.. ఆ యువతిని ఫేలిసియా నెవిన్(26) అనే యువతిగా గుర్తించారు. అయితే ఆమె నివాస స్థలం, ఇతరత్రా విషయాలను పోలీసులు గోప్యంగానే ఉంచారు.

English summary
Felicia Nevins called police after worrying the thermos she was using to store sperm and dry ice in for her artificial insemination could have exploded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X