వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిషన్ మంగళ్: అంతరిక్షాన్నీ వదలట్లేదు: అంగారక గ్రహంపై ఆధిపత్య పోరు: టాప్-3 లిస్ట్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అంతరిక్ష ప్రయోగాల్లో ఆధిపత్య పోరు మొదలైనట్టు కనిపిస్తోంది. అంగారక గ్రహంపై పెత్తనాన్ని సాగించడానికి మూడు దేశాలు పోటీ పడుతున్నాయి. ప్రయోగాల మీద ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఈ మూడు దేశాల ప్రయోగించిన స్పేస్‌క్రాఫ్ట్స్ కొద్దిరోజుల తేడాతో అంగారకుడిపై ల్యాండ్ కావడం యాదృశ్చికమే అయినప్పటికీ.. దాని తీవ్రతను చాటుతున్నాయి. ఆ మూడు దేశాల దృక్కోణం వేర్వేరుగా ఏమీ లేదు. మార్స్‌పై జీవం ఉందనడానికి, నివాసం ఉండటానికి గల అవకాశాలను పరిశీలిస్తోన్నాయి. కొత్త విషయాలను కనుగొనడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి.

Recommended Video

Mars Missions : USA VS China Vs UAE, A Flurry Of Mars Missions - పెత్తనం కోసం 3 దేశాల పోటీ

నిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్‌పై బదిలీ వేటునిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్‌పై బదిలీ వేటు

నాసా హెలికాప్టర్..

అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా పంపించిన ఓ మినీ హెలికాప్టర్.. మంగళవారం అంగారకుడిపై ల్యాండ్ కానుంది. ఆ వెంటనే తన ప్రయోగాలను ఆరంభిస్తుంది. అంగారక గ్రహం ఉపరితలంపై డ్రిల్లింగ్‌ను చేపట్టనుంది. దీని కోసం నాసా శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ రోబో హ్యాండ్‌ను దీనికి అమర్చారు. 1800 గ్రాముల బరువులో హెలికాప్టర్‌ను పోలి ఉన్న ఈ ల్యాండ్ రోవర్‌ను ఐఐటీ-మద్రాస్ ఆలమ్నీ బాబ్ బలరాం రూపొందించారు. గత ఏడాది టేకాఫ్ అయిన ఈ హెలికాప్టర్ మార్స్‌పై నిర్దేశిత ప్రదేశంలో దిగనుంది. ఆ వెంటనే ప్రయోగాలను చేపడుతుంది. మట్టి, ధూళిని సేకరించి దాన్ని నమూనాలను నాసా గ్రౌండ్ స్టేషన్‌కు పంపిస్తుంది.

యూఏఈ హోప్ రోవర్..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పంపించిన హోప్ రోవర్ కూడా కొద్దిరోజుల కిందటే అంగారక గ్రహం కక్ష్యలోనికి ప్రవేశించింది. ఆ వెంటనే దానికి మార్స్ ఫొటోలను భూమికి పంపించింది. హోప్ పేరుతో ఎమిరేట్స్ పంపించిన ఈ స్పేస్ క్రాఫ్ట్ తీసిన తొలి ఫొటోను ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఇప్పటిదాకా వెలుగులోకి రాని అంగారకుడి సరికొత్త రూపాన్ని హోప్ స్పేస్‌క్రాఫ్ట్ చిత్రీకరించింది. ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ ఛైర్‌పర్సన్ సారా అల్ అమీరీ ఈ ఫొటోను ట్వీట్ చేశారు. గత ఏడాది జులైలో ఎమిరేట్స్ ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంగారకుడిపైకి పంపించింది. ఈ నెల 10వ తేదీన అది ల్యాండయింది.

చైనా దూకుడు..

అంతరిక్ష ప్రయోగాల విషయంల చైనా దూకుడు పెంచింది. మార్స్‌‌పై పరిశోధనలను సాగించడానికి ప్రయోగించిన తియాన్వెన్-1 స్పేస్ క్రాఫ్ట్ వారం రోజుల కిందటే అంగారకుడి కక్ష్యలోనికి ప్రవేశించింది. హోప్ స్పేస్ క్రాఫ్ట్ ప్రవేశించిన రెండు రోజుల తరువాత ఇది ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఇది అంగారకుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. అమెరికా, చైనా, ఎమిరేట్స్ గత ఏడాది జులైలో మార్స్‌పైకి స్పేస్ క్రాఫ్ట్‌లను పంపించగా.. అవన్నీ కొన్ని రోజుల తేడాతో కక్ష్యలోనికి ప్రవేశించాయి. ఈ వారంలో ఈ మూడూ దాదాపు ఒకేసారి అంగారకుడిపై ల్యాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

English summary
NASA is about to land a helicopter on the planet Mars on Thursday for the first time. China's Tianwen-1 probe on Monday performed an orbital manoeuvre around Mars. UAE first interplanetary spacecraft Hope, captured a photograph of the Red Planet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X