• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గాలిలో విహారం ..కానీ కాదది ప్రయాణం ... తైవాన్ లో సరదా ఫ్లైట్లు .. వింత సర్వీసులు

|

సహజంగా ఫ్లైట్ ఎక్కితే ఎవరైనా ప్రయాణం చేస్తారు . కానీ అక్కడ మాత్రం ఫ్లైట్ ఎక్కినా ఎక్కడికి ప్రయాణించరు. ప్రయాణం చేసిన అనుభూతిని మాత్రం పొంది వస్తారు. ఇదేంటి వింతగా ఉంది అనుకుంటున్నారా తైవాన్ రాజధాని తైపెయ్ లోని ఒక విమానాశ్రయంలో ఈ తరహా వింత సర్వీసులను అందిస్తున్నారు.

తైవాన్ వైమానిక సంస్థ ఒక ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని అందించే ఆలోచన

తైవాన్ వైమానిక సంస్థ ఒక ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని అందించే ఆలోచన

కరోనా మహమ్మారి చాలా దేశాలలో తన పంజా విసురుతున్న సందర్భంగా చాలా దేశాలలో విమాన సర్వీసులు రద్దయ్యాయి. గత రెండు నెలలుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. కొన్ని దేశాలు ఇతర దేశాలకు ప్రయాణాలను నిలిపివేసి కేవలం ఆయా దేశాలలో మాత్రమే అంతర్గతంగా సర్వీసులను నడిపిస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ప్రయాణాలకు దూరంగా ఉన్న వారికి తైవాన్ వైమానిక సంస్థ ఒక ప్రత్యేకమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ముందుకు వచ్చింది.

EVA ఎయిర్ పేరుతో స్పెషల్ నో డెస్టినేషన్ ఫ్లైట్

EVA ఎయిర్ పేరుతో స్పెషల్ నో డెస్టినేషన్ ఫ్లైట్

ఆగస్టు 8వ తేదీన EVA ఎయిర్ పేరుతో ప్రత్యేక నో డెస్టినేషన్ ఫ్లైట్ ను అందిస్తోంది. తైవాన్లో ఆగస్ట్ 8 న ఫాదర్స్ డే సందర్భంగా ఈ విమానం తైపీ తాయోవాన్ విమానాశ్రయంలో తన సేవలను అందించనుంది. జూలైలో, సాంగ్షాన్ విమానాశ్రయంలో ఒక ఎగరని విమానంతో విమానయాన సంస్థ ప్రజల ముందుకు వచ్చింది . విమానంలో ప్రయాణం చేసిన అనుభవాన్ని వారికి అందించాలని అనుకుంది. అది సక్సెస్ కావటంతో ఇప్పుడు గాలిలో చక్కర్లు కొట్టే ఫ్లైట్ తో మరో సర్వీస్ ప్రారంభించింది.

జులైలో ఎగరని విమానంలో సరదా సర్వీసులు .. ఫ్లైట్ జర్నీ ఫీల్ ..

జులైలో ఎగరని విమానంలో సరదా సర్వీసులు .. ఫ్లైట్ జర్నీ ఫీల్ ..

జూలైలో ఎగరని ఫ్లైట్ సర్వీసు కోసం ఎయిర్ పోర్టులో ప్రయాణికుల రద్దీ, అందరూ బోర్డింగ్ పాస్ చెక్ చేయించుకోవడం, ఫ్లైట్ ఎనౌన్స్ మెంట్ , గబగబా వెళ్లి విమానమెక్కి కూర్చోవడం అన్నీ చకచకా జరిగిపోయాయి. అందరూ తమ సెల్ ఫోన్లతో ఫోటోలు తీసుకొని కాసేపు విమానంలో సరదాగా గడిపారు . కాసేపటికి విమానం దిగి వెనక్కి వచ్చేశారు. సోంగ్షన్ విమానాశ్రయ యాజమాన్యం విమానాశ్రయానికి ఎన్నో మరమ్మతులు చేసింది. వీటిని ప్రజలకు చూపించేందుకే ఈ రకమైన సర్వీసులను ప్రవేశపెట్టింది. ఇక్కడికి వచ్చిన ఔత్సాహికులంతా తమకు ఈ ఫీలింగ్ ఎంతో బాగుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 తైవాన్ ఫాదర్స్ డే స్పెషల్ ... సరదా ప్రయాణమే కాదు గిఫ్టులు కూడా !!

తైవాన్ ఫాదర్స్ డే స్పెషల్ ... సరదా ప్రయాణమే కాదు గిఫ్టులు కూడా !!

ఇక ఇప్పుడు వారు ప్రయాణీకులను ఎక్కడకు తీసుకుపోని కొత్త ప్రయాణ అనుభవాన్ని ప్రారంభించారు. ప్రయాణీకులు "హలో కిట్టి" డ్రీమ్ జెట్‌లో ఆకాశమార్గంలో ఎగురుతారు.సూపర్ పాపులర్ హలో కిట్టి డ్రీమ్ మెషీన్‌తో విదేశాలకు వెళ్ళడానికి EVA ఎయిర్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తుంది అంటూ ఎయిర్ లైన్ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు ఈ విమానం లో ఉచిత వైఫై, టెక్స్ట్ మెసేజింగ్ సేవను అందిస్తుందని, ఇందులో ప్రయాణికులకు అనేక బహుమతులు కూడా అందిస్తామని వారు పేర్కొన్నారు. మొత్తానికి ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయని, గాలిలో సరదాగా ఎగిరే విమానంలో చక్కర్లు కొట్టడానికి తైవాన్ ప్రజలు రెడీ అయిపోయారు.

English summary
Imagine boarding a flight and going absolutely nowhere. That is exactly what EVA Air is offering to its passengers. While the ongoing Covid-19 pandemic has restricted travel within and among most nations, the Taiwan airline has come up with an interesting way to offer a unique travel experience. EVA Air is offering a special no-destination flight on August 8, which is celebrated as Father’s Day in Taiwan. The flight would take off from Taipei Taoyuan Airport, circle the skies before returning to the same airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X