వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 నాటికి.. ఇక అలాంటి ఫోన్లు చూస్తాం: ప్రయత్నాల్లో యాపిల్..

|
Google Oneindia TeluguNews

శాన్‌ఫ్రాన్సిస్కో: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ భవిష్యత్తులో మరో ఆకర్షణీయమైన డివైస్‌ను లాంచ్ చేయబోతోంది. ఫోన్ ను మడిచి జేబులో పెట్టుకునేందుకు అనువుగా ఫోల్డబుల్‌ డివైస్‌లను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

2020నాటికి ఫోల్డబుల్‌ డివైస్‌లను మార్కెట్లోకి తీసుకురావాలని యోచిస్తున్న ఆపిల్.. ఆ దిశగా ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. కంపెనీ ఆసియా భాగస్వాములతో కలిసి ఈ ప్రొడక్ట్ ను రూపొందిస్తారని సమాచారం.

 Foldable Phone in the Works at Apple

బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం.. ఆపిల్ తయారుచేయబోయే ఈ ఫోల్డబుల్ డివైస్ ఐప్యాడ్ టాబ్లెట్ లాగా కూడా పనిచేస్తుందని అంటున్నారు. ఈ ఫోన్లలో ఫోల్డబుల్ ఓఎల్ఈడీ ప్యానళ్లను వాడుతారని చెబుతున్నారు.

ఫోల్డబుల్ డివైస్‌ల తయారీకి సంబంధించి 2017, నవంబర్‌లోనే అమెరికా పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ కార్యాలయంలో ఆపిల్ సంస్థ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆపిల్ ఈ ప్రయత్నాల్లో ఉండగానే.. శాంసంగ్, లెనోవో వంటి కంపెనీలు కూడా ఫోల్డబుల్ ఫోన్ల తయారీకి కసరత్తులు మొదలుపెట్టినట్టు మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

English summary
Apple is working on a foldable phone that may double as a tablet when unfolded, according to a note sent out by Merril Lynch analyst Wamsi Mohan Friday. The same analyst only expects minor updates for this year’s iPhones, CNBC was first to report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X