India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Afghanistan : మరో దారుణానికి ఒడిగట్టిన తాలిబన్లు-ఫోక్ సింగర్ దారుణ హత్య-ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి...

|
Google Oneindia TeluguNews

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మ్యూజిక్‌పై నిషేధం ప్రకటించిన తాలిబన్లు... తాజాగా ఓ జానపద గాయకుడిని దారుణంగా హత్య చేశారు. హత్యకు సంబంధించి కచ్చితమైన కారణాలేవీ ఇంకా తెలియరాలేదు. ఆఫ్గనిస్తాన్‌లోని బాగ్లన్ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

హత్యకు గురైన ఆ జానపద గాయకుడి పేరు ఫవద్ అందరబీ. స్థానికంగా వినిపిస్తున్న కథనం ప్రకారం... గాయకుడు ఫవద్ అందరబీని తాలిబన్లు ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చారు. అనంతరం గన్‌తో అతనిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అందరబీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 folk singer shot dead by taliban in bhaglan province afghanistan

అతని హత్యను ఆఫ్గన్ మాజీ మంత్రి మసౌద్ అందరబీ ధ్రువీకరించారు. 'అందరబ్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి.ఇవాళ వారు ఫోక్ సింగర్ ఫవద్ అందరబీని కాల్చి చంపారు. ఈ అందమైన నేల గురించి... మన పూర్వీకుల గురించి ఆలపిస్తున్నందుకు అతన్ని హత్య చేశారు.' అని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. షరియా చట్టం ప్రకారం ఇస్లామిక్ పాలనలో మ్యూజిక్‌ నిషేధం. ఈ నేపథ్యంలో పాటలు పాడటం కొనసాగించినందుకే అతన్ని చంపేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నిజానికి గతంలోనూ తాలిబన్లు అందరబీ ఇంటికి వచ్చారని... కానీ ఆ సమయంలో కేవలం సోదాలకే పరిమితమయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో ఫవద్ అందరబీతో పాటు అతని కొడుకుతో కలిసి టీ కూడా తాగారని చెప్పారు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో ఇలా దారుణానికి పాల్పడ్డారని... అందరబీ చాలా మంచివాడని అభిప్రాయపడుతున్నారు. తన తండ్రిని గన్‌తో తలలో కాల్చి హత్య చేశారని అందరబీ కొడుకు తెలిపాడు. అన్యాయంగా తన తండ్రిని పొట్టనబెట్టుకున్న తాలిబన్లను శిక్షించాలని తాలిబన్ కౌన్సిల్‌ను కోరినట్లు అతను చెప్పాడు. ఆ మేరకు వారి నుంచి హామీ లభించిందన్నాడు.

ఆఫ్గనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్నాక శాంతి వచనాలు వల్లించిన తాలిబన్లు... చేతల్లో 2001 నాటి పాలనను గుర్తుచేస్తున్నారు. దీంతో ఆఫ్గనిస్తాన్‌లో మానవ హక్కులపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

గత నెలలో అఫ్ఘనిస్తాన్‌ ప్రముఖ కమెడియన్‌ నాజర్ మొహమ్మద్‌ను కూడా తాలిబన్లు ఇలాగే హత్య చేసిన సంగతి తెలిసిందే. నాజర్ మొహమ్మద్‌ను బలవంతంగా ఇంటి నుంచి లాక్కెళ్లి కాల్చి చంపారు. ఖాషా జ్వాన్ టిక్‌టాక్ వీడియోలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. తనదైన హాస్యంతో ఆఫ్ఘనిస్తాన్‌ ప్రజల్లో పాపులారిటీ సంపాదించుకున్నారు. ఆయన హత్య ఆఫ్గన్‌లో తీవ్ర కలకలం రేపింది.హత్యకు ముందు అతనిపై దాడికి పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వెలుగుచూశాయి.

Why masood Azhar met Talibans in Afghanistan and why he is celebrating their victory

ఇస్లాం ప్రకారం ప్రజలను నవ్వించడం నేరమని... అందుకే అతన్ని హత్య చేశామని తాలిబన్లు ప్రకటించారు. తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈ హత్య తమవాళ్లు చేసినదేనని ధ్రువీకరించారు.నాజర్‌ కమెడియన్‌ కావడానికి ముందు కాందహార్‌ ప్రావిన్స్‌లో పోలీసు అధికారిగా విధులు నిర్వహించేవాడు. ఆ సమయంలో ఎంతోమంది తాలిబన్లను హింసించి హత్య చేసిన ఘటనల్లో అతనికి ప్రమేయం ఉందని జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు.కాందహార్ పోలీస్ కమాండర్ సైలబ్.. తాలిబన్ల ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఖాషాను ఎప్పుడూ యుద్ధ క్షేత్రంలో దింపలేదన్నారు. చెక్ పాయింట్ల వద్ద విధుల్లో ఉన్న సమయంలో తన హాస్యంతో అతను అధికారులను ఎంటర్టైన్ చేసేవాడన్నారు.

English summary
Taliban anarchy continues in Afghanistan. The Taliban, who have already announced a ban on music, brutally murdered a folk singer. The exact motive for the murder is not yet known. The incident took place in Baghlan province, Afghanistan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X