వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నోరు విప్పిన లాడెన్‌ నాలుగో భార్య.. ఆ రాత్రి అబోటాబాద్ లో అసలేం జరిగిందంటే..

‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లో దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం..’

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: మే 1, 2011 అమెరికాకు శుభదినం.. ఆ రోజును వారు తమ దేశ చరిత్రలో సువర్ణక్షరాలుగా కూడా రాసుకొని ఉండి ఉంటారు. ఎందుకంటే తమ దేశ గౌరవాన్ని దెబ్బకొట్టి, వేలాది మంది అమెరికన్లను బలి తీసుకున్న అల్‌ కాయిదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను అమెరికా మట్టుబెట్టిందే ఆరోజే.

చదవండి: తెరపైకి బిన్ లాడెన్ వారసుడు, ప్రవక్త వంశానికి చెందినవాడని..

విమానాలతో ఏకంగా ట్విన్‌ టవర్స్‌ను ఢీకొట్టించి అమెరికన్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అల్‌ కాయిదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను ఎంతో పకడ్బందీగా.. ప్రణాళిక రచించి.. గుట్టుచప్పుడు కాకుండా అమలు చేసి.. అంతమొందించింది కూడా ఆ రోజే. అయితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై అన్నీ చెప్పుడు కథనాలే తప్ప.. ప్రత్యక్షంగా చూసిన వారిలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు నోరు విప్పలేదు.

ఆ రోజు ఏం జరిగిందో?

ఆ రోజు ఏం జరిగిందో?

అమెరికాను గడగడలాడించిన అల్‌ కాయిదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ను పాకిస్తాన్లోని అబోటాబాద్ లో అమెరికా సేనలు మట్టుబెట్టిన ఘటన ప్రస్తావన వచ్చినప్పుడల్లా అసలారోజు ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం మిగిలే ఉంటుంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎన్నో కథనాలు వచ్చాయి.

లాడెన్ ఆఖరి క్షణాల్లో...

లాడెన్ ఆఖరి క్షణాల్లో...

కానీ తాజాగా లాడెన్‌ నాలుగో భార్య అమల్‌ ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని కాతీ స్కాట్‌-క్లార్క్‌, అడ్రియాన్‌ లెవీ అనే ఇద్దరికి వెల్లడించింది. లాడెన్‌ చనిపోవడానికి ముందు ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగిందనే విషయంపై వీరు ‘ది ఎక్సైల్‌: ది ఫైట్‌ ఆఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌' పేరుతో ఓ పుస్తకం రాస్తున్నారు.

ప్రత్యక్ష సాక్షి.. అమల్

ప్రత్యక్ష సాక్షి.. అమల్

దీనికి సంబంధించి లాడెన్‌ నాలుగో భార్య అమల్ ను వారు సంప్రదించగా ఆమె వారికి కొన్ని విషయాలు చెప్పింది. అందులో కొన్ని బ్రిటన్‌లోని సండే టైమ్స్‌లో, ఓ టీవీ చానెల్‌లో ప్రసారం అయ్యాయి. అలా ఆమె చెప్పిన కొన్ని విషయాలు ఏమిటంటే..

అర్థరాత్రి.. హెలికాప్టర్ శబ్దం..

అర్థరాత్రి.. హెలికాప్టర్ శబ్దం..

‘ఆ రోజు రాత్రి అమెరికా మిలిటరీకి చెందిన బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్‌ అబోటాబాద్‌లోని మా ఇంటి కాంపౌండ్‌లో దిగింది. అప్పటికే మేం ఆ ఇంట్లో ఆరేళ్లుగా తలదాచుకుంటున్నాం. హెలికాప్టర్‌ శబ్దం విని మేల్కొన్న నా భర్త(లాడెన్‌) ముఖంలో ఏదో తెలియని భీతి కనిపించింది.

వారికి కావాల్సింది నేను, మీరు కాదు..

వారికి కావాల్సింది నేను, మీరు కాదు..

అమెరికన్‌ సీల్స్‌ ఇంటిలోపలికి ప్రవేశిస్తుండగా మా సోదరీలు(లాడెన్‌ ముగ్గురు భార్యలు) (అమల్‌ లాడెన్‌ నాలుగో భార్య) వారి పిల్లలను తీసుకొని ఆయన ఉన్న పై అంతస్తుకు వెళ్లి ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. అయితే, వారిని అక్కడ ఉండొద్దని, అందరినీ కిందికి వెళ్లిపోవాలని లాడెన్‌ చెప్పారు. ‘వారికి కావాల్సింది నేను, మీరు కాదు.. ఇక్కడి నుంచి వెళ్లిపోండి..' అని ఆయన అన్నారు.

మేం పక్కనే ఉన్నాం...

మేం పక్కనే ఉన్నాం...

ఆయన చెప్పినట్లుగానే వారు తమ పిల్లలను తీసుకుని వెళ్లపోయారు. కానీ నేను మాత్రం నా కొడుకు హుస్సేన్ తో కలిసి ఆయన పక్కనే ఉండాలని నిశ్చయించుకున్నాను. అమెరికా సైనికులు లోపలికి వస్తూ లాడెన్‌ కుమారుల్లో ఒకరైన ఖలీద్‌ను చంపేస్తూ పిల్లలతో గొడవపడుతూ పైకి వస్తున్నారు. సరిగ్గా మేం ఉన్న గదికి రాగానే నేను వారిని తోసివేసేందుకు ప్రయత్నించాను.

వస్తూనే కాల్పులు...

వస్తూనే కాల్పులు...

కానీ, అమెరికా సైనికులు లోపలికి వస్తూనే కాల్పులు మొదలుపెట్టారు. నా కాలికి తూటా తగలడంతో నేను పక్క గదిలో పడిపోయాను. ఆ తరువాత కాసేపటికి ఓపిక చేసుకొని తిరిగొచ్చి చూసేసరికి అప్పటికే నా భర్త లాడెన్‌ విగతజీవుడై పడి ఉన్నాడు. ఆ దృశ్యాన్ని నేను నా కొడుకు హుస్సేన్‌ ఇద్దరం చూశాం.

ఆ ఇల్లే.. చివరికి...

ఆ ఇల్లే.. చివరికి...

లాడెన్ మృతదేహాన్ని చూసి నేను నిశ్చేష్టురాలినయ్యాను. ఆరేళ్లపాటు నివసించిన ఆ ఇల్లే మాకు మృత్యుకుహరంగా మారుతుందని మేం ఊహించలేకపోయాం. మేం అక్కడ తలదాచుకుంటున్నట్లు మాకు బాగా తెలిసిన వారే ఎవరో అమెరికన్లకు సమాచారం చేరవేసి ఉంటారు. - ఇదీ లాడెన్ నాలుగో భార్య అమల్ చెప్పిన సంగతులు. ఆమె చెప్పినట్లుగా ఈ మేరకు బ్రిటన్‌ పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ‘ది ఎక్సైల్‌: ది ఫైట్‌ ఆఫ్‌ ఒసామా బిన్‌ లాడెన్‌' పుస్తకం కూడా త్వరలో విడుదల కానుంది.

English summary
The story of the night of May 1, 2011, when US forces killed Osama bin Laden, has been told and retold many times. The US government, US Navy Seals and intelligence analysts have given varying accounts of how it unfolded. Now, for the first time, we see the events of that night through the eyes of his fourth and youngest wife, Amal, who has spoken to Cathy Scott-Clark and Adrian Levy for their book The Exile: The Flight of Osama bin Laden about the last few minutes of the 9/11 mastermind’s life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X