వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆలస్యం కాకముందే..: ప్రపంచానికి సిరియా చిన్నారుల విన్నపం.. హృద్యంగా!

|
Google Oneindia TeluguNews

డమాస్కస్: సిరియా అంతర్యుద్దం కారణంగా గడిచిన ఏడేళ్లలో 4లక్షల మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సిరియా పరిధిలోని గౌటాలో వేర్పాటువాదులపై అక్కడి సైన్యం ఇటీవల చేసిన దాడుల్లో దాదాపు 600మంది ప్రజలు చనిపోయారు. అయినా పరిస్థితి మారలేదు సరికదా మరింత చేయి దాటిపోతుండటంతో.. అక్కడి ప్రజలు వేరే ప్రాంతాలకు పారిపోతున్నారు.

సిరియాలో నరమేధం: 7 ఏళ్ళలో 4 లక్షల మంది మృత్యువాత సిరియాలో నరమేధం: 7 ఏళ్ళలో 4 లక్షల మంది మృత్యువాత

సోషల్ మీడియాలో మహమ్మద్ నజేమ్:

సిరియాలో తాము ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తున్నామో కళ్లకు కట్టేలా.. ఇప్పుడక్కడి చిన్నారులు సోషల్ మీడియాను వేదిక చేసుకున్నారు. మహమ్మద్ నజేమ్ అనే 15ఏళ్ల పిల్లవాడు సోషల్ మీడియాలో ఇటీవల ఓ వీడియో పోస్టు చేశాడు.

అంతర్యుద్దం వల్ల అక్కడి ఇళ్లు, ప్రార్థన స్థలాలు, స్కూళ్లు ఎలా ధ్వంసం అయ్యాయో అందులో చెప్పాడు. అంతేకాదు, తన బంధువుల, స్నేహితుల ఆవేదన గురించి కూడా పంచుకున్నాడు.

సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో.. సిరియా 'ఆకలి'కి సజీవ సాక్ష్యం: ప్రపంచాన్ని కంటతడి పెట్టిస్తున్న ఫోటో..

మహమ్మద్ నజేమ్ ఆవేదన:

ఇది నా స్కూల్.. సిరియా అధ్యక్షుడు అసద్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ల నేరాలకు ఇది లక్ష్యంగా మారింది.

ఇది మా చర్చ్. పుతిన్, అసద్ యుద్ద విమానాలకు ఇది టార్గెట్ అయింది.

ఇది సిరియన్ అరబ్ రెడ్ క్రెసంట్ సెంటర్. పుతిన్, అసద్ ల ఉగ్రవాదానికి లక్ష్యమైంది.

మహమ్మద్ నజేమ్ తన వీడియోలో ఆయా ప్రదేశాలను చూపిస్తూ అక్కడ జరిగిన విధ్వంసం గురించి ఇలా చెప్పుకొచ్చాడు.

వీడియోల రూపంలో..:

వీడియోల రూపంలో..:

డిసెంబర్ 2017లో ట్విట్టర్‌లో చేరిన మహమ్మద్ నజేమ్.. అప్పటినుంచి అక్కడి భయానక పరిస్థితులను వీడియోల రూపంలో ప్రపంచం ముందు పెడుతున్నాడు. అసద్ పాలనలో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న దురవస్థల గురించి ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి తెలుపుతున్నట్టు మరో ట్వీట్ ద్వారా వెల్లడించాడు.

ఆలస్యం కాకముందే.. కాపాడండి ప్లీజ్..:

సిరియాలో ప్రస్తుతం మానవ హక్కులు అన్న ప్రస్తావనకు చోటే లేకుండా పోయింది. ఎప్పుడేం జరుగుతుందోనన్న భయంతో అక్కడి ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో నూర్(10), అలా(8) అనే ఇద్దరూ సిరియన్ అక్కాచెల్లెలు ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు.

'ఈ వీడియో ద్వారా మా బాధను పంచుకుంటున్న ప్రతీ ఒక్కరికి విన్నపం.. మేం ప్రస్తుతం పెను ప్రమాదంలో ఉన్నాం. ఆలస్యం కాకముందే దయచేసి మమ్మల్ని కాపాడండి' అని ఆ చిన్నారులు వేడుకుంటున్నారు.

స్నేహితుడిని కోల్పోయానని..:

మరో వీడియోలో నజేమ్.. తన స్నేహితుడిని కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది నా స్నేహితుడి ఇల్లు. పూర్తిగా ధ్వంసమైపోయింది.

శిథిలాల కింద చిక్కుకుని వారంతా చనిపోయారు. మా ఇంటి చుట్టుపక్కల చక్కర్లు కొట్టిన రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబుల వర్షం కురిపించింది. నాతో పాటు ఆడుకునే నా స్నేహితుడు ఈరోజు నన్ను వదిలిపోయాడు. ఇప్పుడు నేనో ఒంటరిని' అని అందులో పేర్కొన్నాడు.

English summary
round 600 people have died including many children in the fighting in Syria's Eastern Ghouta region. Latest media reports suggest that people are now fleeing the region as the situation there is described to be "beyond critical
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X