వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విదేశీ విరాళాలు: బంగ్లా మాజీ ప్రధాని ఖలేదాకు ఐదేళ్ల జైలు

|
Google Oneindia TeluguNews

ఢాకా: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ అధినేత్రి, ప్రతిపక్ష నాయకురాలు ఖలేదా జియా(72)కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ కోర్టు గురువారం తీర్పు వెలువరించింది.

సుమారు 21 మిలియన్‌ టాకాల(కోటి 61 లక్షల రూపాయలు)ను తనకు చెందిన జియా ఆర్ఫానేజ్‌ ట్రస్ట్‌లోకి విదేశీ విరాళాల రూపంలో మళ్లించి అవినీతికి పాల్పడిన కేసులో కోర్టు ఆమెకు ఈ శిక్ష మేరకు విధించింది.

Former Bangladesh PM Khaleda Zia gets 5-year jail term in graft case

ఈ కేసుతో సంబంధం ఉన్న జియా కుమారుడు తారిఖ్‌ రహమాన్‌తో పాటు మరో నలుగురికి కూడా 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు నేపథ్యంలో బీఎన్పీ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళనలకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా దేశ వ్యాప్తంగా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. హింసలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరికలు చేశారు.

English summary
A special judge's court has sentenced former prime minister and BNP Chairperson Khaleda Zia to five years in prison for corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X