వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాదీ సానియా మీర్జా భర్త కారుకు ప్రమాదం: లారీని గుద్దేసిన స్పోర్ట్స్ కారు: ఎలా ఉంది?

|
Google Oneindia TeluguNews

లాహోర్: హైదరాబాద్‌కు చెందిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి చివరి నిమిషంలో సురక్షితంగా తప్పించుకోగలిగాడు. పాకిస్తాన్‌లోని లాహోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తోన్న స్పోర్ట్స్ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ఓ లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో షోయబ్ మాలిక్‌కు ఎలాంటి గాయాలు తగల్లేదు. సురక్షితంగా బయటపడగలిగాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

లాహోర్‌లోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రధాన కార్యాలయం నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో నిర్వహించిన సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2021కు సంబంధించిన డ్రాఫ్ట్ సమావేశానికి అతను హాజరయ్యాడు. రాత్రి స్పోర్ట్స్ కారులో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో ఈ కారు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ఓ లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనతో స్పోర్ట్స్ కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఢీ కొట్టిన వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో షోయబ్ మాలిక్ సురక్షితంగా తప్పించుకోగలిగాడు. గాయాలు కూడా తగల్లేదు.

Former Cricketer Shoaib Malik reacts after surviving a accident as his sports car rams into truck in Lahore

ఈ సమాచారం తెలిసిన వెంటనే పాకిస్తాన్ క్రీడా ప్రపంచం ఉలిక్కి పడింది. పలువురు క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు షోయబ్ మాలిక్‌కు ఫోన్ చేసి, ప్రమాదం గురించి ఆరా తీశారు. షాహిద్ అఫ్రిదీ, సక్లయిన్ ముష్తాక్, షోయబ్ అఖ్తర్ వంటి పలువురు మాజీ ఆటగాళ్లు అతనికి ఫోన్ చేశారు. ఈ ఘటనపై షోయబ్ మాలిక ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎలాంటి గాయాలు కూడా తగల్లేదని స్పష్టం చేశాడు. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టెస్ట్ మ్యాచ్‌లు, 287 వన్డే ఇంటర్నేషనల్స్, 116 టీ20 మ్యాచ్‌లను ఆడిన షోయబ్ మాలిక్.. ప్రపంచ కప్ తరువాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

English summary
Former Pakistan skipper Shoaib Malik survived a horrific crash as his sports car rammed into a truck in Lahore on Sunday late evening. The 38-year-old all-rounder suffered a scary accident just after attending the recently-concluded Pakistan Super League (PSL).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X