వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష

|
Google Oneindia TeluguNews

అస్తానా: కజకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి సెరిక్ అఖ్ మెతోవ్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టుసంచలనమై తీర్పు చెప్పింది. ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష అర్జీని ఆదేశ అధ్యక్షుడు తొసిపుచ్చారు. తప్పు చేసినందుకు జైలు శిక్ష అనుభవించాలని కోర్టు తీర్పు చెప్పింది.

ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన ఓ వ్యక్తికి కజకిస్థాన్ లో జైలు శిక్షపడటం ఇదే తొలిసారి అని అక్కడి ప్రభుత్వం తెలిపింది. సెరిక్ అఖ్ మెతోవ్ ప్రధానిగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.

Former Kazakhstan prime minister sentenced to 10 Years in Prison

అధికారం అడ్డు పెట్టుకుని నాలుగు అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని సెరిక్ మీద నేరం రుజువు అయ్యింది. అయితే తాను ఏ తప్పూ చెయ్యలేదని, కావాలనే కొందరు వ్యక్తులు తన మీద కక్షకట్టి ఆరోపణలు చేస్తున్నారని సెరిక్ చెబుతూ వచ్చారు.

నా బాధను అర్థం చేసుకుని తనను క్షమించాలని సెరిక్ కజకిస్థాన్ దేశ అధ్యక్షుడికి మనవి చేస్తూ అర్జీ సమర్పించారు. అయితే క్షమాభిక్ష అర్జీని ఆదేశ అధ్యక్షుడు తొసిపుచ్చారు. శనివారం ప్రత్యేక న్యాయస్థానం మాజీ ప్రధాని సెరిక్ కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

English summary
Kazakhstan has sentenced former prime minister Serik Akhmetov to 10 years in prison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X