• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కూతురు ముందే మాజీ మిస్ వెనిజులా దారుణ హత్య

|

Former Miss Venezuela Monica Spear
కారకస్: మాజీ మిస్ వెనిజులా మోనికా స్పియర్ (29), ఆమె మాజీ భర్త, బ్రిటీష్ పౌరుడు థామస్ హెన్రీ బెర్రీ (39)లపై దారి దోపడికీ పాల్పడిన దుండగులు, దోపిడీని అడ్డుకోవడంతో వారిని హత్య చేశారు. ఈ దోపీడిలో వారి ఐదేళ్ల కుమార్తెకు గాయాలయ్యాయి. కారు టైరు పంక్చర్ కావడంతో హైవేపై నిలిచిపోయిన వారిని దోపిడీ దొంగలు అడ్డుకుని వారిని కారులోనే బంధించే ప్రయత్నం చేసి దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు.

వెనిజులాలో తాజాగా జరిగిన ఈ సంఘటనతో అక్కడి పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పలువురు ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేస్తూ ఇలాంటి దోపిడీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల్లో సినీ నటులు, విదేశీ రాయబారులు, బేస్‌బాల్ క్రీడాకారులు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.

సోమవారం అర్ధరాత్రి మోనికా, ఆమె మాజీ భర్త థామస్ బెర్రీలపై నిర్మానుష్యంగా ఉన్న హైవేపై దుండగులు దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. స్పియర్, బెర్రీలు దేశ ప్రధాన ఓడ రేవు, వెలెన్సియా రాజధాని అయిన ప్యూర్టో కెబెల్లో నుంచి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బయల్దేరినట్లు పోలీసులు చెప్పారు. సెలవులపై వెళ్లి తిరిగి కారకాస్‌కు వీరిద్దరు తిరిగి వస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.

ఏదో ఒక పదునైనా వస్తువు తగలడంతో ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారు రెండు టైర్లు పంచర్ అయ్యాయి. దీంతో వారు అక్కడే కొంతసేపు వేచివున్నారు. ఆ సమయంలోనే అక్కడికి చేరుకున్న దుండగులు వారిపై దాడికి దిగి వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను, డబ్బును దోచుకున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో దుండగులు వారిద్దర్నీ హత్య చేశారు. ఈ దోపిడీలో స్పియర్, హెన్రీల ఐదేళ్ల కూతురుకు గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెను బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు విచారణాధికారి జోస్ గ్రేగరియో సియారెల్టా తెలిపారు. అనుమానితులందరూ 18ఏళ్లలోపు వారేనని ఆయన తెలిపారు. కాగా మోనికా స్పియర్ 2004లో మిస్ వెనిజులాగా ఎంపికైంది. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ ఈవెంట్‌లో 5వ రన్నరప్‌గా నిలిచారు. ఆమె అనేక టీవి కార్యక్రమాల్లో కూడా నటించారు. ఆమెకు 3 లక్షల 55వేల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary

 A former Miss Venezuela and her ex-husband were shot and killed and their 5-year-old daughter wounded when they resisted robbers by locking themselves inside their car after tire punctures disabled it on an isolated stretch of highway, police said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more