వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్లో జారి పడ్డ జార్జి బుష్: నిలకడగానే ఆరోగ్యం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌.డబ్ల్యు బుష్ బుధవారం తన ఇంట్లో ప్రమాదవశాత్తూ జారి పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ ఎముక విరిగిపోయింది. దీంతో ఆయన్ని పోర్ట్ లాండ్ మెయిన్ మెడికల్ ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ తెలిపారు. జార్జి బుష్‌ అమెరికా 41వ దేశాధ్యక్షుడిగా (1989-1993) పని చేశారు.

గత నెలలోనే జార్జి బుష్ 91వ పడిలోకి అడుగుపెట్టారు. 2014లో కూడా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో జార్జి బుష్ ఆసుపత్రిలో చేరారు. గత వారంలో జార్జి బుష్ అతని భార్య ఇద్దరూ సంయుక్తంగా అధ్యక్ష ఎన్నికల కోసం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Former President George HW Bush in the hospital after fall

సీనియర్ జార్జి బుష్ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆయన అధికార ప్రతినిధి జిమ్ మెక్‌గ్రాత్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఆయన కుమారుడు జూనియర్ జార్జి బుష్ కూడా అమెరికా అధ్యక్షుడిగా పని చేశారు.

English summary
Former President George H.W. Bush fell Wednesday while at his summer home in Kennebunkport, Maine, breaking a vertebrae in his neck, but "it was not life threatening," his spokesman Jim McGrath told Media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X