వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ జెండాకు నిప్పు: మాజీ సైనికుడి అరెస్టు

|
Google Oneindia TeluguNews

లాహోర్: దేశం కోసం అనేక సంవత్సరాలు సేవలు అందించి ఇప్పుడు ఆ దేశ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టిన మాజీ సైనికుడిని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ అనే వ్యక్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

కామరుల్ జమాన్ అనే వ్యక్తి పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాల వలన అతను ఇంటికి వెళ్లాడు. తరువాత సైన్యంలోకి రాకుండ చాల కాలం పాటు సెలవుల మీద సెలవులు పెట్టాడు. దీంతో చాల కాలం అతను తిరిగి సైన్యంలోకి వస్తాడని అధికారులు భావించారు.

Former Soldier Arrested For Burning National Flag in Pakistan

కామరుల్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైన్యం అతనిని ఆర్మీ నుండి తొలగించింది. తరువాత కామరుల్ ఒక ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అప్పటి నుండి అతను అవకాశం చిక్కిన ప్రతిచోట పాక్ ను విమర్శిస్తున్నాడు.

ఈ నెల 13వ తేదిన అతను పాక్ జాతీయ జెండాను తగలబెట్టాడు. తరువాత ఈనెల 28వ తేది శుక్రవారం పట్టపగలు పాకిస్థాన్ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టాడు. పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. స్థానికులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కామరుల్ జమాన్ ను విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
A former Pakistani soldier has been arrested here for allegedly burning the country's flag and raising anti-nation slogans in public.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X