వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌స్టా‌గ్రాంలో అధ్యక్షుడిపై అవమానకర వ్యాఖ్యలు: టర్కీ మాజీ సుందరికి జైలు

|
Google Oneindia TeluguNews

వెల్లింగ్టన్: మాజీ టర్కిష్ సుందరి మెర్వ్ బుయుక్సరక్‌ రెండేళ్ల జైలు శిక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమమైన ఇన్‌స్టాగ్రామ్‌లో టర్కిష్ అధ్యక్షుడిపై అవమానకర వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆమెకు ఈ జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, తాను చేసిన ఆ వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో 2006లో మిస్ టర్కీగా ఎంపికైన ఈ సుందరి ఆ వ్యాఖ్యలను తొలగించింది.

మురియత్ డెయిల్ న్యూస్ కథనం ప్రకారం.. ది మాస్టర్స్ పొయెమ్ పేరుతో అధ్యక్షుడిపై వ్యంగ్యర్థంతో కూడిన పలు వ్యాఖ్యలు పోస్టు చేసింది ఈ మాజీ సుందరి. కాగా, ఆమె.. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌పై చేసిన వ్యాఖ్యలపై పోలీసులు గత నెలలో ఆమెను ప్రశ్నించారు.

Former Turkish beauty queen faces two years in jail for 'insulting' president on Instagram

తాను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వ్యాఖ్యలను వివిధ మాధ్యమాల్లో ప్రచురితం చేస్తారని తాను ఖచ్చితంగా ఊహించలేదని మాజీ సుందరి మెర్వ్ చెప్పారు. తాను అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను అవమానపర్చాలని ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. తనకా ఉద్దేశం కూడా లేదని తెలిపింది.

అంతేగాక, ఏదో సరదా కోసం ఈ పని చేశానని మెర్వ్ పేర్కొంది. ఒక వేళ మెర్వ్ దోషిగా తేలితే ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

English summary
A former Turkish beauty queen could face imprisonment for two years over an "insulting" Instagram post. Prosecutors allege that Merve Buyuksarac, who won Miss Turkey in 2006, insulted the Turkish president in a post from last summer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X