వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆసుపత్రిలో చేరిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హూస్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆయన్ని హూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రిలో చేర్పించామని బుష్ అధికార ప్రతనిధి జిమ్ మెక్‌గ్రాత్ ఒక ప్రకటనలో తెలిపారు.

Former U.S. President George H.W. Bush Hospitalized as Precaution

గత ఏడాది ఇదే ఆసుపత్రిలో రెండు నెలల పాటు ఆయన చికిత్స పొందారు. 90ఏళ్ల జార్జి బుష్ ప్రస్తుతం టెక్సాస్‌లో నివసిస్తున్నారు. ఇటీవలే ఆయన 90వ పుట్టినరోజుని ఎరుపు, తెలుపు, నీలిరంగు ప్యారాచూట్ కింద స్కైడైవింగ్ చేసి మరీ జరుపుకున్నారు. అమెరికాకు 41వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

అనారోగ్యం కారణంగా కొంతకాలంగా ఆయన వీల్ ఛైర్‌లోనే ఉంటున్నారు. నవంబర్‌లో ఏఅండ్‌ఎమ్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ఆయన వీల్ ఛైర్‌లోనే వచ్చారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫస్ట్ లేడీ మిచెల్ ఒబామా ఇద్దరూ మాజీ అధ్యక్షుడు జార్జి హెచ్‌డబ్ల్యూ బుష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

English summary
Former U.S. President George H.W. Bush was brought by ambulance to a hospital in Houston on Tuesday night, a precautionary measure after experiencing shortness of breath, his office said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X